close
Choose your channels

ప్రేక్షకులు ఒకటి తలిస్తే.. బిగ్‌బాస్ మరొకటి తలిచాడు

Monday, October 19, 2020 • తెలుగు Comments

ప్రేక్షకులు ఒకటి తలిస్తే.. బిగ్‌బాస్ మరొకటి తలిచాడు

మంచి జోష్ ఉన్న సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వెంటనే సండే ఫన్‌డే స్టార్ట్ చేశారు. నోయెల్ సంచాలక్‌గా డాట్స్ గేమ్‌ను నాగ్ స్టార్ట్ చేశారు. దివి, అభిజిత్‌లు గేమ్‌ను స్టార్ట్ చేశారు. బెలూన్స్ పగులగొట్టాలి. ఇద్దరూ సమానంగా పగులగొట్టడంతో టై అయింది. నాగ్ మరో ఛాన్స్ ఇవ్వడంతో దివి రౌండ్ గెలిచేసింది. నెక్ట్స్ గేమ్ ఆమ్ రెజ్లింగ్. మోనాల్, హారిక వచ్చారు. మోనాల్‌ని హారిక ఓడించింది. హారిక బాడీ వెయిట్ వేసిందని చెప్పడంతో నాగ్ మరోసారి చేయించారు. ఈ సారి కూడా హారికాయే గెలిచింది. నెక్ట్స్ గేమ్‌లో మెహబూబ్ విన్ అయ్యాడు. తరువాత కుమార్ గెలిచాడు. దీంతో టీమ్ ఏకు 3, టీమ్ బీకి ఒక పాయింట్ వచ్చింది. బాల్స్‌ని బుట్టలో వేయాలి. అఖిల్ వర్సెస్ లాస్య. ఈ గేమ్‌ను లాస్య గెలిచింది. తరువాత టగ్ ఆఫ్ వార్. టగ్ ఆఫ్ వార్ సైతం టీమ్ ఏ గెలిచింది. నెక్ట్స్ అఖిల్‌, దివిని నాగ్ సేఫ్ చేశారు.

ప్రేక్షకులు ఒకటి తలిస్తే.. బిగ్‌బాస్ మరొకటి తలిచాడు

ప్రాపర్టీస్‌తో సాంగ్‌కి డ్యాన్స్ చెయ్యాలి. అభిజిత్ హారికలు వచ్చారు. వీరిద్దరూ గొడుగుతో డ్యాన్స్ చేయాలి. హారిక గెలిచింది. జోకర్ హ్యాట్, నోస్‌తో కుమార్, నోయెల్ డ్యాన్స్ చేశారు. ఈ రౌండ్‌‌లో కుమార్ సాయి అదరగొట్టేశాడు. అఖిల్, లాస్యలు బేబితో డ్యాన్స్ చేయాలి. ఈ సాంగ్‌ను ఇద్దరూ అర్థం చేసుకోకుండా చేసేశారు. తరువాత ఈ సాంగ్‌ను అమ్మ రాజశేఖర్ చేసి చూపించారు. అయితే అందరూ లాస్యకి ఓటేశారు. బ్లైండ్ ఫోల్డ్.. అరియానా.. అవినాష్ చేశారు. అవినాష్ అదరగొట్టేశాడు. కళ్లకు గంతలున్నా అవినాష్.. అరియానా చేయిని పట్టుకోవడంపై నాగ్ ఫన్నీ కామెంట్స్ చేశారు. తరువాత సొహైల్, మోనాల్.. సొహైల్ అమ్మాయిలా అదరగొట్టేశాడు. తరువాత హారిక, మోనాల్‌లతో నాగ్ చేయించారు. నెక్ట్స్ దివి, మెహబూబ్ రాగానే మాస్టర్ దివికి కొరియోగ్రఫీ చేసి చూపించారు. అయినప్పటికీ మెహబూబ్‌ని మాత్రం దివి కొట్టలేకపోయింది. నెక్ట్స్ అరియానాను సేఫ్ చేసి మోనాల్, కుమార్ సాయిలను లగేజ్ ప్యాక్ చేసుకుని కన్ఫెషన్ రూమ్‌కి రమ్మని చెప్పారు. అఖిల్ చాలా షాక్‌లో కనిపించాడు.

ప్రేక్షకులు ఒకటి తలిస్తే.. బిగ్‌బాస్ మరొకటి తలిచాడు

మోనాల్, కుమార్ కన్ఫెషన్ రూమ్‌కి వచ్చాక.. మీ ఇద్దరిలో ఒకరు స్టేజ్‌పైకి వస్తున్నారు మరొకరు కన్ఫెషన్ రూమ్‌లోనే ఉండబోతున్నారు అని నాగ్ చెప్పారు. కుమార్ సాయిని స్టేజ్‌పైకి పిలిచారు. మోనాల్‌ని కన్ఫెషన్‌ రూమ్‌లోనే ఉంచారు. నిజానికి ఒక టాలెంటెడ్ కంటెస్టెంట్ బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అక్కడ జీరోగా చూసిన కుమార్ సాయి.. బయట మాత్రం హీరో అయిపోయాడు. తాను ఒక కథ రాసుకున్నానని అది చెప్పేందుకు తనకు అవకాశం ఇవ్వాలని నాగ్‌ని కోరగా.. నాగ్ ఓకే అన్నారు. దీంతో కుమార్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఉల్లిపాయతో అరియానాను కుమార్ పోల్చాడు. అవినాష్.. ఆటలో అరటిపండు లాంటి వాడని కుమార్ చెప్పాడు. కూరలో కరివేపాకు అఖిల్ అని కుమార్ సాయి చెప్పాడు. బాగా ఆడతాడు కానీ రిజల్ట్ రావడం లేదని చెప్పాడు. దీంతో మీరు ఆడి కూడా బయటకు వెళ్లిపోయావని అఖిల్ చెప్పాడు. తమలోని మైనస్ చెబితే హౌస్‌లో కొందరు తీసుకోలేరు. వాళ్లలో అఖిల్ ఒకడని ఇవాళ రియాక్ట్ అవడం బట్టి తెలుస్తోంది. కాకరకాయ.. అమ్మ రాజశేఖర్ అని.. అభి కూల్ అని.. లాస్య చీర కట్టుకుంటే మొక్కజొన్న కంకిలా ఉంటుందని చెప్పాడు. క్యాబేజీ నోయెల్ అని.. వేరుశనగ సొహైల్ అని కుమార్ సాయి చెప్పాడు. పైనాపిల్ వచ్చేసి దివి అని చెప్పాడు.

వంకాయని హారికకు ఇచ్చారు. బాయిల్డ్ ఎగ్‌ను మెహబూబ్‌కి కుమార్ ఇచ్చాడు. వెళ్లేటప్పుడు కూడా ఓ పాటకు డ్యాన్స్ కుమార్ ఇరగదీశాడు. మోనాల్ కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు రావడంతో హౌస్‌మేట్స్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక బిగ్‌ బాంబ్.. ఎవరిపై వేస్తే వాళ్లు ఒక వారం పాటు వాష్ రూమ్స్ క్లీన్ చెయ్యాలి. బిగ్ బాంబ్‌ను కుమార్.. అమ్మ రాజశేఖర్‌పై వేశాడు. ఇక అంతా మోనాల్‌ని అప్రిషియేట్ చేస్తుంటే అఖిల్ మాత్రం దూరంగా ఉండిపోయాడు. తరువాత అఖిల్‌‌ని పిలిచి మరీ మోనాల్ హగ్ చేసుకుంది. ప్రేక్షకులు ఒకటి తలిస్తే బిగ్‌బాస్ మరొకటి తలిచాడు. మొత్తానికి మోనాల్ సేఫ్. కుమార్ సాయి అవుట్.

ప్రేక్షకులు ఒకటి తలిస్తే.. బిగ్‌బాస్ మరొకటి తలిచాడు

Get Breaking News Alerts From IndiaGlitz