close
Choose your channels

ఆగ‌స్ట్‌లో బిగ్‌బాస్ 4..!

Tuesday, May 26, 2020 • తెలుగు Comments

ఆగ‌స్ట్‌లో బిగ్‌బాస్ 4..!

తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్‌. తెలుగులో స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న‌ ఈ రియాలిటీ షో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సీజ‌న్స్‌ను పూర్తి చేసుకుంది. ఎప్ప‌టి నుండో నాలుగో సీజ‌న్ స్టార్ట్ అవుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా..సోష‌ల్ మీడియాలో ఇప్పుడు బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ ప్రారంభం గురించి రోజుకొక వార్త వినపడుతుంది. నిజానికి క‌రోనా ఎఫెక్ట్ లేకుండా ఉండుంటే జూన్‌లోనే బిగ్‌బాస్ సీజ‌న్ 4 ప్రారంభం కావాల్సింది. కానీ ఇప్పుడు ఆల‌స్యంగా ప్రారంభం అవుతుంద‌ట‌.

ఇప్పుడిప్పుడే నిర్వాహ‌కులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అన్నీ ఏర్పాటు పూర్త‌య్యేలోపు ప్ర‌భుత్వం నుండి అనుమ‌తులు కూడా తీసుకోనున్నార‌ట‌. అంతా స‌జావుగా సాగితే జూలై నెల‌లో బిగ్‌బాస్ సీజ‌న్ 4 గురించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. సీజ‌న్ 3కి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన అక్కినేని నాగార్జున, సీజ‌న్ 4లోనూ వ్యాఖ్యాత‌గా వ‌హ‌రించున్నార‌ని టాక్‌. లేటెస్ట్ సమాచారం మేరకు జూలై చివరి వారం లేదా ఆగ‌స్ట్ మొద‌టి వారంలో బిగ్‌బాస్ సీజన్ 4 చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అంతే కాకుండా.. ఈ సినిమాలో పాల్గొన‌బోయే కంటెస్టెంట్ విష‌యంలో రీసెంట్‌గా వ‌చ్చిన వార్త‌ల్లో నిజం కూడా లేదంటూ స‌ద‌రు వర్గాలు పేర్కొన్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz