close
Choose your channels

బిగ్‌బాస్ 4 వాయిదా?

Wednesday, August 12, 2020 • తెలుగు Comments

బిగ్‌బాస్ 4 వాయిదా?

తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్‌. తెలుగులో స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న‌ ఈ రియాలిటీ షో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సీజ‌న్స్‌ను పూర్తి చేసుకుంది. ఎప్ప‌టి నుండో నాలుగో సీజ‌న్ స్టార్ట్ అవుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా..సోష‌ల్ మీడియాలో ఇప్పుడు బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్‌కు మూడో సీజ‌న్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన కింగ్ నాగార్జునే వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన యాడ్ షూటింగ్‌లోనూ నాగ్ పాల్గొనేశారు. నిజానికి ఆగ‌స్ట్ 30న ఈ సీజ‌న్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని వార్త‌లు వినిపించాయి. కానీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల తాజా స‌మాచారం మేర‌కు బిగ్‌బాస్ 4ను సెప్టెంబ‌ర్‌కు వాయిదా వేశార‌ట‌.

బిగ్‌బాస్ 4ను ఎందుకు వాయిదా వేశారు? అనే దానిపై ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా కొన్ని ప‌నుల‌ను అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేయ‌లేక‌పోయార‌ట‌. దీంతో కాస్త ఆల‌స్యంగానైనా వ‌స్తేనే మంచిదని నిర్వాహ‌కులు అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. ఎలాగూ దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వ‌లేదు కాబ‌ట్టి నిర్వాహ‌కులకు వ‌చ్చిన స‌మ‌స్య‌లేమీ లేదు. కంటెస్టెంట్స్ విష‌యంలోనూ నిర్వాహ‌కులు సీక్రెసీని మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఈసారి బిగ్‌బాస్ క‌రోనా వ‌ల్ల పది వారాలు మాత్ర‌మే ఉంటుంద‌ని టాక్‌.

Get Breaking News Alerts From IndiaGlitz