close
Choose your channels

BiggBoss: అభినయశ్రీ ఎలిమినేట్.. ఇంత త్వరగా పంపిస్తారా అంటూ ఎమోషనల్

Monday, September 19, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ రెండో వారం పూర్తయ్యింది. తొలి వారం ఇంటి సభ్యులు ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి అవకాశం కల్పించిన నిర్వాహకులు. సెకండ్ వీక్‌లో ఇద్దరిని ఎలిమినేట్ చేస్తామని ముందే లీకుల ద్వారా తెలియజేశారు. శనివారం షానీని బయటకు పంపించివేయగా.. తర్వాతి టార్గెట్ అభినయశ్రీ అని అందరికీ ముందే అర్థమైంది. దీనికి తగ్గట్టుగా ఆమెను ఎలిమినేట్ చేశారు నాగార్జున. బబ్లీ బౌన్సర్ ప్రమోషన్‌లో భాగంగా తమన్నా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది. ఆమె చేతికి ఓ కానుకను ఇచ్చి ఇంట్లోకి పంపారు నాగ్. అది కేవలం మగవాళ్లకు మాత్రమేనని తెలిపాడు.

మగవాళ్లను, ఆడవాళ్లను వేరు చేసి సరదాగా గేమ్ ఆడించారు నాగ్. లేడి కంటెస్టెంట్స్‌లో ఎవరు బౌన్సర్ కావాలనుకుంటున్నారో చెప్పి వారి చేతికి బ్యాండ్ కట్టాలని చెప్పాడు. వీరిలో ఎక్కువ మంది గీతూ వైపే మొగ్గుచూపారు. అబ్బాయిల్లో బౌన్సర్‌ని సెలెక్ట్ చేసే బాధ్యతను తమన్నాకిచ్చారు నాగ్. దీంతో ఆమె రోహిత్, రేవంత్, అర్జున్, సూర్యని ఎంపిక చేసుకుంది. వీరి నలుగురు తమన్నాని తమ టాలెంట్‌తో ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. రేవంత్ పాట పాడగా.. సూర్య మిమిక్రీ, రోహిత్, అర్జున్‌లు తమ మాటలతో మిల్కీబ్యూటీని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే వీరిలో సూర్యకి గిఫ్ట్ ఇచ్చి హౌస్‌మేట్స్‌కి వీడ్కోలు పలికింది తమన్నా.

అనంతరం ఎలిమినేషన్ ప్రక్రియను స్టార్ట్ చేశారు నాగార్జున. ఇంటి సభ్యులను రెండు టీమ్‌లుగా విభజించి ‘‘గజిబిజి గానా’’ ఆటను ఆడించాడు. ఈ టాస్క్‌లో గజిబిజిగా వుండే అక్షరాలు డిస్ ప్లే అవుతాయి. కంటెస్టెంట్స్ దానిని సరిగ్గా గుర్తించి అది ఏ పాటో చెప్పాలి. గేమ్ ఆడిస్తూ ఫైమా, రేవంత్, రాజశేఖర్, మెరీనా అండ్ రోహిత్‌, గీతూలను సేవ్ చేశారు నాగార్జున. చివరిగా ఆదిరెడ్డి, అభినయశ్రీలు మాత్రమే మిగిలారు. ఇందుకోసం నాగార్జున రెండు ద్రవ పదార్థాలు కలిగిన రెండు గాజు గ్లాసులు తీసుకున్నారు. దీనిలో ఒకదానికి అభినయశ్రీ ఫోటో, మరో దానికి ఆదిరెడ్డి ఫోటో వుంది. ఈ రెండింటిలో దేనికి ఎరుపు రంగు వస్తుందో వాళ్లు ఎలిమినేట్ అవుతారని నాగ్ చెప్పారు. ఇందులో అభినయ గాజు గ్లాసు రెడ్ కలర్‌లోకి మారింది. దీంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు నాగ్.

అనంతరం స్టేజ్ మీదకు వచ్చిన అభినయశ్రీ జర్నీని చూపించారు నాగ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రేక్షకులు ఇంత త్వరగా తనను బయటకు పంపిస్తారని అనుకోలేదని ఉద్వేగానికి గురైంది. దీంతో ఆమెకు ఓ టాస్క్ ఇచ్చారు నాగ్.. హౌస్‌లో హానెస్ట్‌గా వున్న వారు, హానెస్ట్‌గా లేని వారు ఎవరో చెప్పాలని ఆదేశించారు. ఫైమా, చంటి, శ్రీసత్య, బాలాదిత్యలు హానెస్ట్ అని... హానెస్ట్‌గా లేని వారి కేటగిరీలో ఒక్క రేవంత్‌కి మాత్రమే ఓటు వేసింది. టాస్క్ మధ్యలో పర్సనల్ విషయాలు చెబుతాడని, కన్నింగ్‌లా కనిపిస్తున్నావని రేవంత్ మొహం మీదే చెప్పినట్లు తెలిపింది. గీతూ చాలా బ్రేవ్ అని.. ఖచ్చితంగా టాప్ 3లో వుంటుందని జోస్యం చెప్పి అందరికీ వీడ్కోలు పలికింది అభినయశ్రీ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.