Bigg Boss Faima: బిగ్‌బాస్‌లో వున్నందుకు ఫైమా రెమ్యూనరేషన్ ఎంతంటే.. వామ్మో అంత..?

  • IndiaGlitz, [Tuesday,December 06 2022]

బిగ్‌బాస్ 6 తెలుగు రసవత్తరంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. 13 వారాలను విజయవంతంగా కంప్లీట్ చేసుకుని, 14వ వారంలోకి అడుగుపెట్టింది. మరికొద్దిరోజుల్లో విజేత ఎవరో తేలిపోనుంది. ఎప్పటిలాగే గత వారం కూడా ఎలిమినేషన్ జరిగింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఫైమా హౌస్‌ను వీడింది. నిజానికి గత వారమే ఆమె ఎలిమినేషన్ అవ్వాల్సింది.. కానీ అప్పుడు ఆమెను ఫ్రీ ఎవిక్షన్ పాస్ కాపాడటంతో రాజ్ బలయ్యాడు. కానీ ఈ వారం మాత్రం తప్పించుకోలేకపోయింది. భారమైన గుండెతో కంటతడితో ఫైమా ఇంటిని వీడింది. వెళుతూ వెళ్తూ నాగ్‌ ఆమె చేతిని ముద్దాడి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

గత వారమే ఎలిమినేట్ అవ్వాల్సిన ఫైమా:

అయితే గత వారం నామినేషన్స్‌లో ఫైమా అస్సలు వుండాల్సింది కాదు.. రేవంత్ ఆమెను నామినేట్ చేయడం శాపంగా మారింది. ఫ్రీ ఎవిక్షన్ పాస్‌ను అటు తిరిగి ఇటు తిరిగి తానే వాడుకోవడమే ఆమె కొంపముంచిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీజన్‌లో తొలి 5 వారాలు గేమ్ బాగా ఆడింది.. కానీ ఎప్పుడైతే సుదీపతో, మెరీనాతో వెటకారం స్టార్ట్ చేసిందో  అప్పటి నుంచే ఫైమాకు ఓటింగ్ శాతం తగ్గిపోయింది. ఇక నామినేషన్స్‌లో ఫైమాను మించిన స్ట్రాంగ్ ప్లేయర్స్‌ నామినేషన్స్‌లో వుండటంతో ఆమెకు ఓట్లు పడలేదు. దీంతో ఫైమా ఎలిమినేషన్ అవ్వక తప్పలేదు.

వారానికి పాతిక వేల చొప్పున రెమ్యూనరేషన్:

ఇకపోతే.. 13 వారాలు ఇంట్లో వున్నందుకు ఫైమాకు పారితోషికంగా ఎంత ముట్టిందనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రెమ్యూనరేషన్ విషయాన్ని బయట పెట్టొద్దంటూ బిగ్‌బాస్ చెప్పినప్పటికీ.. కంటెస్టెంట్స్‌‌కు చెందిన బంధువులు, స్నేహితుల ద్వారా ఈ మ్యాటర్ క్షణాల్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి 13 వారాలకు గాను ఫైమాకు వారానికి రూ.25,000 చొప్పున.. రూ.3,25,000 పారితోషికంగా అందుకున్నట్లుగా సమాచారం.

 

 

More News

Deepti Sunaina : చీరకట్టులో, స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌లో దీప్తి సునైన ... లేలేత పరువాలతో చెక్కిలిగింతలు

టిక్‌టాక్, డబ్ స్మాష్, యూట్యూబ్ స్టార్‌గా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుని ఆ పాపులారిటీతో బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేసింది దీప్తి సునైన.

Connect: నయనతార హారర్ థ్రిల్లర్ 'కనెక్ట్' ఈ నెల 22న రిలీజ్

నయనతార నాయికగా నటించిన హారర్ థ్రిల్లర్ "కనెక్ట్" సినిమాను యూవీ క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.

'రుద్రంగి' చిత్రంలో ఆశిష్ గాంధీ మల్లేశ్ పాత్రలో ఫస్ట్ లుక్ విడుదల

ఎం.ఎల్.ఏ, కవి, గాయకుడు, రాజకీయ వేత్త  శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ లో  భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా 'రుద్రంగి'.

'సెల్ఫీష్' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం!

రౌడీబాయ్స్ చిత్రంలో హీరోగా అందరి హృదయాలను కొల్లగొట్టిన కథానాయకుడు ఆశిష్ నటిస్తున్న ద్వితీయ చిత్రం సెల్ఫీష్.

Anand Ravi: ‘కొరమీను’ సినిమా చూసి హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు - ఆనంద్ ర‌వి

ఆనంద్ రవి కథానాయకుడిగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్