close
Choose your channels

BiggBoss: కెప్టెన్‌గా రాజ్‌శేఖర్.. చంటి చెంప పగులగొట్టిన ఆర్జే సూర్య , షాకైన సుధీర్‌బాబు

Saturday, September 17, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నిన్నటి ఎపిసోడ్‌లో తమ జీవితంలోని విషాద ఘటనలను చెప్పి కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులను ఏడిపించిన ఇంటి సభ్యులు.. ఇవాళ మాత్రం యథావిధిగా రెచ్చిపోయారు. ఈరోజు కెప్టెన్ టాస్క్ ఉండటంతో ఇంటి సభ్యులంతా తమ నోటికి, చేతులకి పనిచెప్పారు. కెప్టెన్సీ పోటీదారులుగా వున్న చంటీ ఆర్జే సూర్య, రాజశేఖర్, ఇనయాలు డీజేలుగా వ్యవహరించారు. ఇద్దరు కలిసి ఒక ఓటుగా తాము ఎవరిని కెప్టెన్‌గా భావిస్తున్నామో వారికి ఓటు వేయాల్సి వుంటుంది. ఇందులో ఎక్కువగా రాజశేఖర్‌కి ఓట్లు పడటంతో ఆయన ఈ వారం కెప్టెన్‌ అయ్యాడు. ఆర్జే సూర్యకి మూడు, చంటికి రెండు, ఇనయాకి ఒక ఓటు వచ్చింది.

ఎవరూ ఊహించని విధంగా రాజశేఖర్ కెప్టెన్ అవ్వడంతో ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులు కూడా షాక్‌కు గురయ్యారు. ఇతను ఒక్కసారి కూడా తన గొంతు వినిపించలేదు, టాస్కుల్లో కొట్టుకోవడం, గొడవపడటం, ఇతర విషయాల్లోనూ యాక్టివ్‌గా లేడు. అలాంటి వ్యక్తికి కెప్టెన్సీ కీరిటం దక్కడం ఆశ్చర్యకరం. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నందుకు సానుభూతితో ఇంటి సభ్యులు ఆయనకు ఓట్లేశారు. మరి ఆయన ఇంటిని ఎలా నడుపుతాడో చూడాలి. మీరు ఇచ్చిన బాధ్యతను అంత: కరణ శుద్ధితో నిర్వహిస్తానంటూ మహేశ్ బాబు రేంజ్‌లో ప్రమాణ స్వీకారం చేశాడు రాజ్. అయితే కెప్టెన్సీ టాస్క్‌లో ఓడిపోయిన ఇనయా కంటతడి పెట్టింది. రాజ్ కేవలం సానుభూతి ఓట్లతోనే గెలిచాడని, ఇలా ఓట్లేసే పద్ధతి కన్నా ఆటల్లో గెలిచి ఎప్పటికైనా కెప్టెన్ అవుతానని శపథం చేసింది.

ఇకపోతే.. ‘ఆ అమ్మాయి గురించి ఒకటి చెప్పాలి’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా హీరో హీరోయిన్లు సుధీర్ బాబు - కృతిశెట్టిలు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ ఇంటి సభ్యులతో సరదాగా టాస్క్‌లు ఆడించారు. ముఖ్యంగా పాపులర్ డైలాగ్‌లు చెప్పించారు. సూపర్‌స్టార్ మహేశ్ బాబు పోకిరి సినిమాలోని ‘‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతోందో’’ అనే డైలాగ్ చెప్పడానికి రేవంత్ పడిన అపసోపాలు నవ్వు తెప్పించాయి. గీతూ బుజ్జిగాడులో ప్రభాస్‌లా నటించింది. శ్రీహాన్, ఫైమా కలిసి పోకిరి సినిమాలోని లిఫ్ట్ ఎపిసోడ్‌తో కామెడీ పండించారు. ఆర్జే సూర్య పవన్ కల్యాణ్, విజయ్ దేవరకొండ వాయిస్‌లను బాగా మిమిక్రీ చేశాడు. షానీ, చంటీ, ఆర్జే సూర్య, అభినయశ్రీలు వెంకీ సినిమాలోని సీన్లు చేశారు. ముఖ్యంగా చెంపదెబ్బ కొట్టే సన్నివేశంలో చంటిని కొట్టడంతో ఇంటి సభ్యులు షాక్ అయ్యారు. అయితే ఇది స్కిట్ కావడంతో అంతా సరిపెట్టుకున్నారు. ఇక చివరిలో శ్రీహాన్‌ని ఉత్తమ నటుడిగా, శ్రీసత్యను ఉత్తమ నటిగా ఎంపిక చేశారు.

సుధీర్ బాబు, కృతి వెళ్లిపోయాక ఇంటి సభ్యుల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. చంటిపై రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆయనకు కామెడీ రాదని, తాను వేసేవే జోకులు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడని కామెంట్ చేశాడు. రేపు (శనివారం) నాగార్జున వస్తుండటంతో పాటు నామినేషన్‌లో వున్న వారిలో ఎవరు సేఫ్ అవుతారో, ఎవరు ఎలిమినేట్ అవుతారోనన్న టెన్షన్ నెలకొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.