‘బిగ్‌బాస్’ తెలుగు అప్‌డేట్ వచ్చేసింది..

  • IndiaGlitz, [Tuesday,July 21 2020]

బిగ్‌బాస్ సీజన్ స్టార్ట్ అవుతుందంటేనే ముందు నుంచే ఊహాగానాలు మొదలవుతుంటాయి. సీజన్ 4 కి సంబంధించి కూడా ఎప్పటి నుంచో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీనిపై సోమవారం బిగ్‌బాస్ యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. బిగ్‌బాస్ సీజన్ 4కి సంబంధించిన లోగోను నిన్న నిర్వాహకులు విడుదల చేసి అభిమానుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇంట్లో జరిగే ప్రతిదాన్ని ప్రేక్షకులకు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. అయితే హోస్ట్ గురించి కానీ.. కంటెస్టెంట్స్ గురించి కానీ బిగ్‌బాస్ యాజమాన్యం ఎలాంటి వివరాలనూ వెల్లడించలేదు.

కాగా.. ఈ సారి హోస్ట్‌గా నాగార్జున కానీ.. విజయ్ దేవరకొండ గానీ ఉండొచ్చని తెలుస్తోంది. బిగ్‌బాస్ 1, 2లతో పోలిస్తే సీజన్ 3 అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీనికి ముఖ్య కారణం కంటెస్టెంట్‌లేనని తెలుస్తోంది. ఈ సారి అలాంటి తప్పిదం జరగకుండా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలనే బిగ్‌బాస్ యాజమాన్యం ప్రేక్షకులుగా తీసుకురానుందని సమాచారం. ఇప్పటికే పలువురి కంటెస్టెంట్‌ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.