బిహార్ తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో 53.54 శాతం ఓటింగ్

  • IndiaGlitz, [Thursday,October 29 2020]

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నేడు ప్రారంభమయ్యాయి. నేడు మొదటి దశ పోలింగ్‌ జరిగింది. ఈ పోలింగ్‌లో 53.54 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. బిహార్ రాష్ట్రంలోని 71 నియోజవకర్గాల్లో నేడు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ ముగిసే సమయానికి 53.54 శాతం ఓటింగ్ నమోదు అయింది. అయితే 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గింది.

గత ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్‌లో 54.94 శాతం పోలింగ్ నమోదు అయింది. కాగా.. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా 56.1 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లోనూ కాస్త అటు ఇటుగా అదే ఓటింగ్ శాతం నమోదు అయ్యేట్లు కనిపిస్తోంది. కాగా.. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం మొదటి దశ పోలింగ్ కొనసాగుతుండగా.. 94 అసెంబ్లీ స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండో విడత పోలింగ్ నవంబర్ 3న, మిగిలిన 78 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న మూడవ విడతలో పోలింగ్ జరగనుంది.