బిగ్‌బాస్ ఓటీటీ నాన్ స్టాప్ విజేతగా బిందు మాధవి... సోషల్ మీడియాలో లీకులు, గెలిస్తే చరిత్రే

బిగ్‌బాస్ .. బుల్లితెరపై దీనికి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హిందీలో అడుగుపెట్టిన ఈ షో.. క్రమంగా భారత్‌లోని ప్రాంతీయ భాషలకు సైతం విస్తరించింది. ఇంటిల్లిపాదికి వినోదాన్ని అందిస్తున్న ఈ రియాలిటీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్‌కి విపరీతైన ఫాలోయింగ్, పాపులారిటీ వస్తోంది. ప్రస్తుతం బిగ్‌బాస్ నాన్‌స్టాప్ పేరిట ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గతకొన్ని వారాలుగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న ఈ షోకి ఇవాళ్టీతో ఎండ్ కార్డ్ పడనుంది. బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే అప్‌డేట్స్‌ అప్పుడే సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న దాని ప్రకారం.. సినీనటి బిందు మాధవి బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ టైటిల్‌ విన్నర్‌గా నిలిచినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈసారైనా విన్నర్‌‌గా నిలవాలన్న అఖిల్‌ కల కలగానే మిగిలిపోయినట్లయ్యింది.

టాప్‌-4లో ఉన్న కంటెస్టెంట్లకు హోస్ట్ నాగార్జున డబ్బులు ఆఫర్‌ చేయగా అరియానా గ్లోరీ రూ.10 లక్షల బ్రీఫ్‌ కేసును తీసుకొని టైటిల్‌ రేసు నుంచి తనకు తానుగా నిష్క్రమించింది. ఆ తర్వాత టాప్‌-3లోని కంటెస్టెంట్స్‌కి నాగ్ మరోసారి మనీ ఆఫర్‌ చేయగా.. శివ, బిందు, అఖిల్‌ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. ఫైనల్‌గా బిందు, అఖిల్‌కి మధ్య జరిగిన రేస్‌లో బిందు విజేతగా నిలిచినట్లు తెలుస్తోంది.

ఆదివారం అర్ధరాత్రి నుంచి ఓటింగ్ ప్రారంభం కాగా.. బుధవారం అర్ధరాత్రితో ఓటింగ్ ముగిసింది. నాలుగు రోజుల పాటు నువ్వా నేనా అంటూ అఖిల్-బిందు మాధవిల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ పోరులో చివరికి బిందు మాధవి పైచేయి సాధించి అఖిల్ కంటే ఎక్కువ ఓట్లు రాబట్టినట్లుగా సమాచారం. ఆమె గెలిస్తే.. బిగ్‌బాస్‌ చరిత్రలోనే తొలిసారి ఒక అమ్మాయి టైటిల్‌ విన్నర్‌గా నిలిచి చరిత్ర సృష్టించినట్లవుతుంది.
ఇకపోతే.. ఈ సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా వచ్చిన బాబా మాస్టర్‌ టాప్ 7 స్థానంలో నిలవగా, అనిల్‌ 6వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత మిత్రా, అరియానా గ్లోరీ, శివ వరుసగా టాప్‌- 3 స్థానాల్లో నిలిచినట్లు టాక్‌ వినిపిస్తుంది.

More News

ఈసారి ఓట్లు చీలనివ్వను.. బీజేపీని ఒప్పిస్తా , చిన్న పదానికే భయమెందుకు : వైసీపీకి పవన్ చురకలు

వచ్చే ఏపీ ఎన్నికల్లో పొత్తులపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరింత క్లారిటీ ఇచ్చారు.

అర్ధరాత్రి ఎన్టీఆర్ ఇంటి ముందు ఫ్యాన్స్ రచ్చ .. పోలీసుల లాఠీఛార్జ్, ఉద్రిక్తత

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తన 39వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తమ అభిమాన నటుడి బర్త్ డే కావడంతో ఆయనకు విషెస్ తెలియజేయడానికి గురువారం

మిల్లర్ల చేతిలో పౌర సరఫరాల శాఖ కీలుబొమ్మ.. స్కామ్ వెనుక ‘పెద్దలు’ : వైసీపీ సర్కార్‌‌పై నాదెండ్ల ఆరోపణలు

వైసీపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుల

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ : తెలంగాణ అమ్మాయి జరీన్‌కు స్వర్ణం.. కేసీఆర్, చంద్రబాబు, పవన్ అభినందనలు

తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది. 52 కిలోల

'భళా తందనానా' అంటున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ !

క్రైమ్ సినిమాలు చూశాం. ఎమోషనల్ సినిమాల డెప్త్ మనకు తెలుసు. సస్పెన్స్ సినిమాలు మనల్ని అలరించాయి.