బిపాసా ఇంత పొగరబోతా?

  • IndiaGlitz, [Tuesday,March 07 2017]

బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బ‌సు గురించి ఇప్ప‌టివ‌ర‌కూ మ‌న‌కు తెలిసింద‌ల్లా ఒక‌టే యాంగిల్. మంచి పెర్పామ‌ర్. రొమాన్స్ స‌న్నివేశాల్లో రెచ్చిపోయి న‌టిస్తుంది. బిప్స్ సినిమా అంటే కుర్రాళ్లు పిచ్చెక్కిపోతారు. ఇదే మ‌న‌కు తెలిసింది. అయితే ఆమెలో మ‌రో యాంగిల్ కూడా ఉంద‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇండియా-పాకిస్తాన్, లండ‌న్ ఫ్యాష్ షో ర్యాంప్ వాక్ లో హొయ‌లు పోతాన‌ని నిర్వాహ‌కుల‌తో అమ్మ‌డు ఒప్పందం కుదుర్చుకుని చివరికి వాళ్లంద‌రికీ కుచ్చు టోపీ పెట్టేసింది. చివ‌రి నిమిషంలో షో కు గైర్హాజ‌రై ఇలా చివాట్లు తినాల్సి వ‌చ్చింది. షో నిర్వాహ‌కురాలు రోహిణి శ‌ర్మ రేఖి లైన్ లోకి వ‌చ్చి బిప్స్ వేశాల‌న్నింటిని బ‌ట్ట‌బ‌య‌లు చేసింది.
'బిప్స్ కు లండ‌న్ లో స్టార్ హోట‌ల్ గ‌దులు బుక్ చేశాం. వెంట భ‌ర్త‌ను తీసుకొస్తానంటే ఒప్పుకున్నాం. అడ్వాన్స్ ఇచ్చాం. అక్క‌డ ల్యాండ్ అవ్వ‌గానే రెండు సిమ్ కార్డులిచ్చాం. అందులో ఐదు పౌండ్లు మాత్ర‌మే రిచార్జ్ ఉంద‌ని వాటిని నేల‌కేసి కొట్టింది. షో కోసం ఇచ్చిన అమౌంట్ ను హ‌నీమూనికి ఖ‌ర్చు పెట్టేసుకుంది. అయినా భ‌రించాం. వాట‌న్నింటిని మ‌ర్చిపోయి షోకు రావాలని గౌర‌వంగా పిలించాం. రాన‌ని మొండికేసింది. దీంతో మేము భారీగా న‌ష్ట‌పోయాం. మా న‌ష్టం పూడ్చాల్సిందే. అప్ప‌టి వ‌ర‌కూ బిప్స్ పై పొర‌డ‌త‌మ‌ని మ‌ధ్య‌లో మ‌సాలా ద‌ట్టించి నానా చివాట్లు పెట్టింది ఆర్గ‌నైజేష‌న్.

More News

చివరి షెడ్యూల్ లో 'కుర్రతుఫాన్'

సిక్స్ఫ్రెండ్స్ క్రియేషన్స్ బ్యానర్లో మాస్టర్ శ్రీరామచంద్ర గొర్రెపాటి సమర్పణలో దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, పి.సి. రెడ్డిల శిష్యుడు డా|| క్రిష్ణమోహన్ గొర్రెపాటి దర్శకుడిగా పరిచయం అవుతూ..తెరకెక్కిస్తున్న చిత్రం 'కుర్రతుఫాన్'. ఈ చిత్రం చివరి షెడ్యూల్ మార్చి 3వ తేదీ నుండి మొదలైంది.

కుర్ర హీరోతో కలర్స్ బ్యూటీ!

తెలుగమ్మాయ్ స్వాతి స్పీడ్ మళ్లీ తగ్గింది. ఆ మధ్య వరుసగా కమిట్ మెంట్ల జోరు పెంచినట్లు కనిపించినా ఎందుకనో ఒక్కసారిగా చల్లబడిపోయింది. ప్రస్తుతం ఫోకస్ అంతా కోలీవుడ్ సినిమాలపైనే పెట్టింది. సొగసరి చేతిలో రెండు సినిమాలున్నాయి.

పవన్ అంత రిస్క్ చేయడా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న `కాటమరాయుడు` షూటింగ్ చివరి స్టేజ్ లో ఉంది. ఫ్యాక్షనిస్టు పాత్రలో పవన్ తొలిసారి కనిపించడంతో సినిమా పై భారీ అంచనాలున్నాయి.

డెబ్యూ హీరో కోసం కన్నడ సూపర్ స్టార్స్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.ఆర్ మనోహర్ అన్నతయుడు ఇషాన్ హీరోగా రూపొందిన చిత్రం `రోగ్`. జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ పతాకంపై డా|| సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మిస్తున్న డిఫరెంట్ లవ్ స్టోరీ త్వరలోనే విడుదలకు సిద్ధం కానుంది.

పూరి సిసలైన పైత్యం 'రోగ్'

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పెన్ను పైత్యం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.