వెండితెరపైనా నవ్వులు పూయిస్తున్న బిత్తిరి సత్తి!

  • IndiaGlitz, [Saturday,February 25 2017]

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిత్తిరి సత్తి అంటే తెలియనివారుండరని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అనతికాలంలోనే యాంకర్ గా విశేషమైన పాపులారిటీ దక్కించుకొన్న బిత్తిరి సత్తి ఈమధ్య సినిమాల్లోనూ కనిపిస్తూ అలరిస్తున్నాడు.

నిన్న విడుదలైన "విన్నర్"లో బిత్తిరి సత్తిది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు బిత్తిరిసత్తి. త్వరలో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద"లో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ లో కనిపించనున్నాడు. ఇది కాకుండా ఎన్.శంకర్-సునీల్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా, జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో మినిస్టర్ గంటా శ్రీనివాస్ తనయుడు గంటా రవితేజ కథానాయకుడిగా పరిచయమవుతూ తెరకెక్కుతోన్న చిత్రం మరియు రానా-తేజ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలోనూ బిత్తిరి సత్తి కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇవి కాకుండా ఇంకొన్ని చిత్రాల్లోనూ నటించేందుకు సన్నద్ధమవుతున్నాడు. చూస్తుంటే.. తెలుగు చిత్రసీమకు బిత్తిరి సత్తి రూపంలో మరో బ్రహ్మాండమైన కమెడియన్ దొరికినట్లే!

More News

'వెళ్ళిపోమాకే' ఆడియో విడుదల

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్రాజు విడుదల చేస్తున్న చిత్రం 'వెళ్ళిపోమాకే'.

యాంకర్ రవి హీరో అయ్యాడోచ్!!

స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్టైలిష్ లుక్స్,మేనరిజమ్స్ తో బుల్లితెర ప్రేక్షకులను గత కొంతకాలంగా విశేషంగా అలరిస్తున్న రవి

పూరి 'రోగ్' కి ఇంప్రెస్ అయిన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యంగ్ హీరో ఇషాన్ ను 'రోగ్ ' చిత్రం ద్వారా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే.

శివ కాశీపురం ఫస్ట్ లుక్ ఆవిష్కరణ

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు , శ్రీ తనయుడు రాజేష్ శ్రీ చక్రవర్తి ని హీరోగా పరిచయం చేస్తూ సాయి హరీశ్వర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై మోహన్బాబు పులి మామిడి నిర్మిస్తోన్న చిత్రం 'శివ కాశీపురం'.

మురళీ మోహన్ చేతుల మీదుగా మిక్చర్ పొట్లం ఆడియో ఆవిష్కరణ

జయంత్, శ్వేతా బసు ప్రసాద్, గీతాజంలి హీరో, హీరోయిన్లగా నటిస్తోన్న చిత్రం `మిక్చర్ పొట్లం`. సతీష్ కుమార్ ఎం.వి దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి సినీ టోన్ పతాకంపై లయన్ కలపటపు శ్రీ లక్ష్మి ప్రసాద్, కంటె వీరన్న చౌదరి, లంకల పల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.