దిశ నిందితుల్లాగే.. నిర్భయ నిందితులను కాల్చేయండి: బీజేపీ నేత

  • IndiaGlitz, [Tuesday,March 17 2020]

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’కు పాల్పడిన నిందితులను హైదరాబాద్‌ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. చటాన్‌పల్లి దగ్గరే పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన ఈ ఘటన యావత్ భారత్‌ దేశంలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తెల్లారు జామున సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడంతో పాటు.. పోలీసులపై రాళ్లు రువ్వి.. వారి వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు యత్నించగా ఆత్మరక్షణ కోసం నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అక్కడికక్కడే నిందితులు ఆరిఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు మృతి చెందిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది.

నిర్భయ నిందితులనూ కాల్చేయండి!
అయితే.. నాటి నుంచి రేప్ నిందితులకు ఇలాంటి శిక్షే విధించాలనే డిమాండ్ కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు ఘటనలు జరగ్గా ఆ కామాంధులను ఎన్‌కౌంటర్ చేయాలని బాధిత కుటుంబాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయ్. అయితే.. తాజాగా.. సంచలనం సృష్టించిన నిర్భయ కేసులోని నిందితుల విషయంలోనూ ఇదే డిమాండ్ వస్తోంది. ఓ వైపు డెత్ వారెంట్ జారీ చేసినా.. దాన్ని ఆపేందుకు నిందితులు స్టేట్, సుప్రీం, అంతర్జాతీయ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో పదే పదే ఉరి శిక్ష మాత్రం వాయిదా పడుతూనే వస్తోంది.

సోషల్ మీడియా స్టార్ రియాక్షన్
ఇలా ఉరి వాయిదా పడుతూ వస్తుండటంతో విసిగిపోయిన బీజేపీ సోషల్ మీడియా స్టార్, బీజేపీ అధికార ప్రతినిధి తజిందర్ సింగ్ బాగా కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. దిశ నిందితులను కాల్చి చంపినట్లుగా నిర్భయ నిందితులను కూడా కాల్చేయాలని ఆయన ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ ట్వీట్‌ను హైదరాబాద్ పోలీస్‌కు ట్యాగ్ కూడా చేశారు. నిర్భయ దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషుల్లో ముగ్గురు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అక్షయ్, పవన్ కుమార్ గుప్తా, వినయ్ శర్మ ముగ్గురూ తమకు విధించిన ఉరి శిక్షపై ‘స్టే’ విధించాలని కోరుతూ ఐసీజేలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విసిగిపోయిన తజిందర్ సింగ్ పై విధంగా రియాక్ట్ అయ్యారు.

More News

కరోనాపై ‘RRR’ హీరోల యుద్ధం.. ఈ ఆరు సూత్రాలు చాలు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా.. వేలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనాలోని

నిర్మలమ్మకు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ థ్యాంక్స్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బృందం కలిసింది.

నితిన్‌కి నో చెప్పిన నాని హీరోయిన్‌!!

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు.

కరోనా ఎఫెక్ట్.. పొరుగు రాష్ట్రంలో అన్నీ బంద్

‘కరోనా’ నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాల కీలక నిర్ణయం తీసుకున్నాయి.

ఫెడ‌వుట్ హీరోతో సామ్‌!!

ప్ర‌స్తుతం మ‌హిళా ప్ర‌ధాన చిత్రాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్న హీరోయిన్స్‌లో స‌మంత అక్కినేని ఒక‌రు.