జగన్ కోసం తిరుమల కొండెక్కా.. కానీ మాట తప్పారు’

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సీఎం కావాలని తాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న కొండెక్కానని కానీ.. జగన్ అధికారంలోకి వచ్చి సీఎం పదవి చేపట్టాక మాట తప్పారని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. గురువారం నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని చెప్పి జగన్ మాట తప్పారన్నారు. డాక్టర్ సుధాకర్‌ను అవమానించటం దళితులను అవమానించిట్లేనని ఆయన అన్నారు. డాక్టర్ సుధాకర్పై ప్రభుత్వ తీరును మోత్కుపల్లి తీవ్రంగా ఖండించారు.

జగన్ కోసం కొండెక్కా..!

‘వైఎస్ జగన్ గెలుపులో నా కృషి కూడా ఉంది. జగన్ గెలవాలని కాలి నడకన తిరుమల కొండ ఎక్కాను. కృష్ణా జిల్లాకు వెంటనే ఎన్టీఆర్ పేరు పెట్టాలి. ఎన్టీఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా చేయాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరుతున్నాను. ఎన్టీఆర్ పార్టీ పెట్టకుంటే కేసీఆర్ ఎక్కడ ఉండేవాడు?. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తాం’ అని మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోత్కుపల్లి వ్యాఖ్యలపై టీఆర్ఎస్, వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

టాలీవుడ్‌ పెద్దలు.. బాలయ్యకు ఒక్క మాట కూడా చెప్పలేదా!?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు, థియేటర్స్ తిరిగి ప్రారంభింపజేయాలని టాలీవుడ్ పెద్దలు నానా తంటాలే పడుతున్నారు.

ఏపీలో చిత్ర పరిశ్రమకు చేయూతనివ్వండి : సీఎం జగన్ కు నిర్మాతల మండలి లేఖ

చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్టూడియోలు, ల్యాబ్స్, అలాగే నిర్మాతలకు, ఆర్టిస్టులకు,

మహేష్ 27 టైటిల్

సూపర్ స్టార్ మహేష్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం మే 31న ప్రారంభం కానుంది అని సినీ వర్గాల సమాచారం.

సమంత మంచి మనసు

మంచి జరిగినప్పుడు సంతోష పడడం సాధారణమైన విషయం. అయితే మంచి జరిగినప్పుడు పదిమందికి సాయపడటం గొప్ప విషయం.

మ్యాడ్ మూవీ లో కైలాష్ ఖేర్ పాడిన సూఫీ పాటకి మంచి స్పంద‌న

ప్రస్తుత జనరేషన్ ని ప్రతిబింబించేలా పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రాబోతున్న చిత్రం "మ్యాడ్".ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేసింది