ఏపీపై కేటీఆర్ కామెంట్.. ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటూ బీజేపీ నేత ఫైర్

  • IndiaGlitz, [Tuesday,November 24 2020]

మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. తండ్రితో కలిసి ఇప్పటికీ కేటీఆర్.. తెలంగాణ, ఆంధ్రల మధ్య గొడవలు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ, ఆంధ్ర రైతులను అన్యాయంగా రెచ్చగొట్టారన్నారు. హైదరాబాద్‌లో ఓట్ల కోసం నీకు ఇప్పుడు ఆంధ్రా గుర్తొచ్చిందా? అంటూ విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రెచ్చగొట్టే మాటలు ఆపి.. అభివృద్ధి కోసం ఆలోచించాలని కేటీఆర్‌కు విష్ణువర్దన్‌రెడ్డి సూచించారు.

‘‘అయ్యా..! ఇప్పుడెందుకు గుర్తొచ్చింది. కేటీఆర్ గారు..! మీరు మీనాన్నమాత్రం తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య నేటికీ గొడవలు పెడుతున్నారు? నాగార్జున సాగర్‌లో, శ్రీశైలంలో నీటి పేరుతో తెలంగాణ, ఆంధ్ర రైతులను అన్యాయంగా రెచ్చగొట్టారు. నేడు హైదరాబాద్‌లో ఓట్ల కోసం నీకు ఆంధ్ర ఇప్పుడు
గుర్తొచ్చిందా? కవులు, కళాకారులు స్వాతంత్ర సమరయోధులు విగ్రహాలను ట్యాంక్ బండ్ మీద కూల్చి రెచ్చగొట్టిన మీ అనైతిక చర్యలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అన్నదమ్ముల్లాగా ఉన్న ఆంధ్ర, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే మాటలు ఆపి తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచించండి. తెలంగాణ సమాజంతో పాటు ఆంధ్ర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు’’ అని విష్ణువర్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

కాగా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ ఏపీ ప్రస్తావన తీసుకు రావడంతో అక్కడి నేతలు మండిపడుతున్నారు. ఏపీకి కొత్త రాజధానిగా శంకుస్థాపన చేసుకున్న అమరావతికి సైతం లొట్టెడు నీళ్లు.. తట్టెడు మట్టి తప్ప ఏమిచ్చారని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని నగరాల్లో గుంతల్లేని రోడ్డు చూపిస్తే తానే రూ.10 లక్షలు ఇస్తానని కేటీఆర్‌ అన్నారు.

More News

బాలీవుడ్ స్టార్ట్స్‌ని వెనక్కి నెట్టేసిన సోనూసూద్..

సోనూ సూద్ రీల్ విలన్ కాస్తా.. కరోనా మహమ్మారి దేశంలోకి ఎంటర్ అవగానే రియల్ హీరోగా మారిపోయిన విషయం తెలిసిందే.

షూటింగ్‌కి సడెన్‌గా ప్యాకప్ చెప్పి వెళ్లిపోయిన శ్రుతిహాసన్..

అగ్ర‌హీరో క‌మ‌ల్‌హాస‌న్ కుమార్తెగా వెండితెర‌కు ప‌రిచ‌యమైనప్పటికీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి నటిగా శ్రుతిహాసన్ సొంత గుర్తింపును సంపాదించుకోగలిగింది.

పర్మిషన్ వచ్చేసింది... తెర తొలిగేదెప్పుడు?

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణలోని సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు మార్చి 15 నుంచి మూత పడ్డాయి.

వారం తిరగక ముందే హారిక కొట్టిన దెబ్బకు.. నామినేషన్స్‌లో మోనాల్

‘రావే చేద్దాం దాండియా.. జర ఊగిపోదా ఇండియా’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. ఇక అభి చేసిన దోశలను బిగ్‌బాస్‌కు చూపించి మరీ సొహైల్ ఆట పట్టించడం చాలా ఫన్నీగా అనిపించింది.

33 మంది మిలీషియా సభ్యుల లొంగుబాటు

మావోయిస్టు పార్టీ సిద్దాంతాల పట్ల ఆకర్షితులై వారికి సహకరిస్తున్న మిలీషియా సభ్యులు వారి సిద్ధాంతాల పట్ల విరక్తితో సోమవారం కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఎదుట లొంగిపోయారు.