close
Choose your channels

ఏపీ రాజధాని నిర్మాణంపై బాంబ్ పేల్చిన బీజేపీ ఎంపీ!

Sunday, August 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ రాజధాని నిర్మాణంపై బాంబ్ పేల్చిన బీజేపీ ఎంపీ!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం అసలు అక్కడే ఉంటుందా..? లేకుంటే తరలింపు ఉంటుందా..? అనేదానిపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనతో రాజధాని రైతులు, ఏపీ ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే బొత్స అలా నోరు జారేడేమో అనుకుంటే.. మళ్లీ మళ్లీ అదే మాట మాట్లాడటంతో రాజధాని రైతుల్లో మరింత ఆందోళన పెరిగింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యవహారంపై ఇంతవరకూ స్పందించి క్లారిటీ ఇవ్వకపోవడం.. మరోవైపు మీడియాలో వరుస కథనాలు పుంకాలు పుంకాలుగా వస్తుండటంతో ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియని ఏపీ ప్రజలు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.

ఆశలు వదులుకోవాల్సిందే..

అయితే తాజాగా.. టీడీపీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న టీజీ వెంకటేష్.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చి ఉన్నట్టుండి బాంబు పేల్చారు. అమరావతిపై ఆశలు వదుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. అంతటితో ఆగని ఆయన.. ప్రత్యామ్నాయ రాజధానులపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీ అధిష్ఠానంతో చర్చించారని సడన్ ట్విస్ట్ ఇచ్చారు.

ఆ నాలుగు ప్రాంతాల్లోనే..!

కాషాయ కండువా కప్పుకున్న తర్వాత చాలా రోజుల తర్వాత ఓ టీవీ చానెల్‌ ప్రతినిధితో మాట్లాడిన టీజీ పై వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని విజయనగరం, గుంటూరు, కాకినాడ, కడప జిల్లాలను రాజధానులుగా ప్రొజెక్టు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ విషయం బీజేపీ అధిష్ఠానమే తనకు తెలియజేసిందని చెప్పుకొచ్చారు. అధికార పార్టీ యోచన బట్టి నవ్యాంధ్రకు ఒకటి కాకుండా నాలుగు రాజధానులు ఉండే అవకాశం ఉందన్నారు. అయితే పోలవరం టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. పోలవరాన్ని జగన్ నిర్లక్ష్యం చేస్తే చంద్రబాబుకు రాజకీయంగా లైఫ్ ఇచ్చిన వారవుతారని జోస్యం చెప్పారు.

అసలేం జరుగుతోంది.. జగన్ క్లారిటీ ఇస్తారా..!?

ఇదిలా ఉంటే ఇటీవలే మీడియా ముందుకు ఒకసారి కాదు రెండుసార్లు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరి మాత్రం తనకేమీ తెలియదన్నట్లుగా మాట్లాడటం.. టీజీ మాత్రం అంతా తనకు తెలుసని మాట్లాడటంతో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి. సోమవారం నాడు వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వెళ్తుండటంతో.. పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడి రాజధాని వ్యవహారంపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి జగన్ ఏం ప్రకటన చేస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.