BJP:12 మందితో నాలుగో జాబితా విడుదల చేసిన బీజేపీ

  • IndiaGlitz, [Tuesday,November 07 2023]

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత అభ్యర్ధుల జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. మొత్తం 12 మంది అభ్యర్ధులతో కూడిన జాబితాను పార్టీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ విడుదల చేశారు. ఈ జాబితాలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావుకు నిరాశ ఎదురైంది. ఆయన తనయుడు వికాస్ రావు వేములవాడ నుంచి టికెట్ ఆశించగా.. తుల ఉమకు అవకాశం కల్పించింది. ఇక ఇటీవల పార్టీలో చేరిన సుభాష్ రెడ్డికి ఎల్లారెడ్డి టికెట్, చలమల్ల కృష్ణారెడ్డికి మునుగోడు టికెట్‌ను కేటాయించింది.

12 మంది అభ్యర్థులు..

చెన్నూరు - దుర్గం అశోక్
ఎల్లారెడ్డి - వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
వేములవాడ - తుల ఉమ
కొడంగల్ - బంటు రమేష్ కుమార్
సిద్ధిపేట - దూది శ్రీకాంత్ రెడ్డి
నకిరేకల్ - నకరకంటి మొగులయ్య
గద్వాల - బోయ శివ
మిర్యాలగూడ - సాదినేని శ్రీనివాస్
ములుగు - అజ్మీరా ప్రహ్లాద్ నాయక్
హుస్నాబాద్ - బొమ్మా శ్రీరామ్ చక్రవర్తి
మునుగోడు - చలమల్ల కృష్ణారెడ్డి
వికారాబాద్ - పెద్దింటి నవీన్ కుమార్

బీజేపీ ఇప్పటి వరకు నాలుగు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తొలి విడతలో 52 మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. రెండో విడతలో ఒక్కరి పేరు మాత్రమే ప్రకటించింది. మూడో విడతలో 35 మందితో అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా నాలుగో విడతలో 12మందితో జాబితాను అనౌన్స్ చేసింది. నాలుగు విడతల్లో మొత్తం 100 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 19 స్థానాల్లో జనసేనతో పొత్తు నేపథ్యంలో ఇప్పటికే 9 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. జనసేన మాత్రం అంతకంటే ఎక్కువ స్థానాలు కోరుతుంది. ఇవాళ హైదరాబాద్‌లో జరగనున్న ప్రధాని మోదీ పర్యటన తర్వాత దీనిపై క్లారిటీ రానుంది.

More News

Chhattisgarh and Mizoram:ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలో ప్రశాంతం కొనసాగుతోన్న పోలింగ్..

లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.

Prime Minister Modi :హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే..

తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. పోటాపోటీ ప్రచారాలతో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి.

BRS MLC Kalvakuntla:రష్మిక డీప్ ఫేక్ వీడియో వ్యవహారం : కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి, మహిళలను కాపాడాలంటూ రాష్ట్రపతి, ప్రధానికి విజ్ఞప్తి

టాలీవుడ్ అగ్రకథానాయిక, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Rashmika:రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన సినీ, రాజకీయ ప్రముఖులు.. ఏమన్నారంటే..?

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన హీరోయిన్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియోపై సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా స్పందిస్తున్నారు.

Revanth Reddy: సీఎం కేసీఆర్‌పై కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ.. కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

తెలంగాణ ఎన్నికల ప్రచారం ఆఖరి అంకానికి చేరుకున్నాయి. పోలింగ్‌కు మరో 22 రోజులు మాత్రమే ఉంది. దీంతో పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.