వానతి శ్రీనివాసన్ చేతిలో కమల్ హాసన్ ఓటమి

  • IndiaGlitz, [Monday,May 03 2021]

మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు. దక్షిణ కోయంబత్తూరులో ఆయన పోటీ చేశారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి వానతి శ్రీనివాసన్ చేతిలో కమల్ హాసన్ ఓటమి పాలయ్యారు. తొలుత స్వల్ప మెజారిటీతో కమల్ విజయం సాధించారని వార్తలు వచ్చాయి. నిజానికి కొన్ని రౌండ్ల పాటు కమల్ ఆధిక్యమే కొనసాగింది. అయితే చివరి రౌండ్లలో వానతి శ్రీనివాసన్ అనూహ్యంగా పుంజుకున్నారు. దీంతో ఆమె విజయం సాధించారు.

Also Read: సూప‌ర్‌స్టార్ మ‌హేష్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో భారీ చిత్రం

వానతి ప్రస్తుతం బీజేపీ జాతీయ మహిళా విభాగం చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలుపునకు కారణమయ్యాయి. 1,540 ఓట్ల స్వల్ప మెజార్టీతో కమల్ పై వానతి నెగ్గారు. వానతికి 52,627 ఓట్లు రాగా.. కమల్ కు 51,087 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మయూర ఎస్ జయకుమార్ కు 41,663 ఓట్లు పడ్డాయి. అయితే తమిళనాడులో డీఎంకే పార్టీ ఘన విజయం సాధించింది. అన్నాడీఎంకే గట్టి పోటీ ఇచ్చినా స్టాలిన్ హావా ముందు నిలబడలేకపోయింది. దీంతో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.