Delhi Assembly Elections: మోదీపై ఢిల్లీకి నమ్మకం


Send us your feedback to audioarticles@vaarta.com


ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ గద్దెపై అధికారాన్ని దక్కించుకున్న బీజేపీని ప్రజలు పూర్తిస్థాయిలో విశ్వసించారని అన్నారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా సమావేశం ఏర్పాటుచేసిన చంద్రబాబు.. ఢిల్లీ ప్రజలు సరైన టైమ్ లో సరైన పార్టీని ఎన్నుకున్నారని మెచ్చుకున్నారు. దేశంలోని ప్రజలందరి ఆత్మగౌరవానికి సంబంధించిన గెలుపుగా దీన్ని అభివర్ణించారు.
వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం ఢిల్లీని మార్చేశాయన్న ముఖ్యమంత్రి.. ప్రధాని మోదీ అనుసరిస్తున్న సుస్థిర అభివృద్ధి విధానాన్ని ఢిల్లీ ప్రజలు నమ్మారని అన్నారు. ఆప్ పాలనలో ఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని, కొన్ని విధానాల వల్ల అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిపోయిందని ఆరోపించారు బాబు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాగైతే తమ తప్పులు తెలుసుకొని వైసీపీని ఇంటికి పంపించారో.. ఢిల్లీ ప్రజలు కూడా సరిగ్గా అదే విధంగా వ్యవహరించారని అన్నారు చంద్రబాబు. గుజరాత్ లో సుస్థిర పాలనతో వృద్ధి 15 రెట్లు పెరిగిందని, అదే విధంగా ఢిల్లీలో కూడా సుస్థిర పాలన, అభివృద్ధి రాబోతున్నాయని అన్నారు చంద్రబాబు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com