మ్యాజిక్‌ను మళ్లీ క్రియేట్ చేస్తారా?
Send us your feedback to audioarticles@vaarta.com
బాక్సాఫీస్ దగ్గర కొన్ని కాంబినేషన్స్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి మ్యాజిక్ 2012లో జరిగింది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో రూపొందిన `గబ్బర్ సింగ్` చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. పదేళ్ల పాటు సరైన హిట్ లేని పవన్‌కల్యాణ్‌కు గబ్బర్‌సింగ్ ఓ రకంగా హిట్ ఆకలిని తీర్చేసింది. పవన్‌కల్యాణ్‌ను ఆయన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా తెరపై ఆవిష్కరించి అందరితో శభాష్ అనిపించుకున్నాడు డైరెక్టర్ హరీశ్ శంకర్. ఇప్పుడు మరోసారి ఈ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ రిపీట్ కానుందని సినీ వర్గాల సమాచారం.
వివరాల్లోకెళ్తే.. పవన్‌కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లక ముందుగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో ఓ సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకున్నాడు. కానీ పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ ప్రాజెక్ట్ పక్కన పడింది. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. తదుపరి ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కాబట్టి ఈలోపు పవన్ తన కమిట్మెంట్స్ను పూర్తి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకోసమని, పవన్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలోఓ సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నారట. అయితే రీసెంట్గా డైరెక్టర్ క్రిష్ చెప్పిన కథ నచ్చడంతో పవన్‌కల్యాణ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మరోపక్క మైత్రీ సంస్థ తమ సినిమాను హరీశ్ శంకర్‌తో ప్లాన్ చేసుకుంటుంది. మరి ఈ రెండు చిత్రాలను పవన్ ఎలా కంప్లీట్ చేస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.