'బ్ల‌ఫ్ మాస్ట‌ర్' రిలీజ్ డేట్‌

  • IndiaGlitz, [Saturday,December 01 2018]

మనిషికి ఆశ ఉండడం సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే అనర్ధాలు జరుగుతాయి. అత్యాశ‌ప‌రుల‌ను టార్గెట్ చేసే ఓ వ్యక్తి కథతో త‌మిళంలో తెర‌కెక్కిన చిత్రం 'చ‌తురంగ వేట్టై'. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో 'బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌' పేరుతో రీమేక్ అవుతోంది. శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ అధినేత ర‌మేష్ పిళ్లై ఈ చిత్రానికి నిర్మాత. గోపీ గ‌ణేష్ ప‌ట్టాభి దర్శకుడు. 'జ్యోతిల‌క్ష్మి', 'ఘాజి' చిత్రాల ఫేమ్ స‌త్య‌దేవ్ హీరోగా నటించారు .

'ఎక్క‌డికి పోతావు చిన్నవాడా' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో నాయిక‌. ఈ చిత్రాన్ని ముందుగా సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల చేయాల‌ని యూనిట్ అనుకుంది. కానీ ఆల‌స్య‌మైంది. తాజాగా సినిమాను డిసెంబ‌ర్ 28న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

More News

ఓవర్సీస్ లో 'కవచం' విడుదల చేస్తున్న రెడ్ హార్ట్ మూవీస్..

బెల్లంకొండ శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ జంట‌గా న‌టించిన సినిమా క‌వ‌చం. ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది.

తెలుగు రాష్ట్రాల్లో 2.0 క‌లెక్ష‌న్స్ డ్రాప్

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ '2.0'. న‌వంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు త‌మిళ, హిందీ భాష‌ల్లో గ్రాండ్ లెవ‌ల్లో

చిరు అసంతృప్తి.. సైరా వ‌చ్చే ఏడాదేనా

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు నిరాశ త‌ప్పేలా లేదు. ఎందుకంటే.. ఆయ‌న 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది.

మ‌రో భారీ త్రిభాషా చిత్రం మొద‌లైంది...

ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ మోహ‌న్ లాల్‌ టైటిల్ పాత్ర‌లో ఓ భారీ పీరియాడిక్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. 16వ శ‌తాబ్దానికి చెందిన ప్ర‌ముఖ నావికా సేనాధిప‌తి మ‌ర‌క్కార్ జీవితానికి

అఖిల్ సినిమా పై బోయ‌పాటి క్లారిటీ...

మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో చేస్తున్న 'విన‌య విధేయ రామ‌' పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌తో బిజీ బిజీగా ఉన్నారు.