close
Choose your channels

చిరు-కొరటాల మూవీలో బాలీవుడ్ నటుడు కీలకపాత్ర!

Friday, February 28, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరు-కొరటాల మూవీలో బాలీవుడ్ నటుడు కీలకపాత్ర!

మెగాస్టార్ చిరంజీవి త‌న‌ 152వ చిత్రాన్ని కొర‌టాల శివ ద‌ర్శక‌త్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమాను ఆగ‌స్ట్ 14 లేదా 15న విడుద‌ల చేస్తార‌ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే లీకులు స్టార్ట్ అవ్వగా.. రూమర్స్ మాత్రం పెద్ద ఎత్తున వచ్చేస్తున్నాయ్. చిరు యంగ్ రోల్‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించనున్నాడని.. ఆయన పాత్ర నక్సలైట్ పాత్ర అని కొన్నిరోజులుల.. అబ్బే అదేం లేదే బన్నీ నటిస్తున్నాడని.. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తు్న్నాడని.. ప్రస్తుతం ఇంకా చర్చలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగు చూసింది.

అధికారికంగా ప్రకటన!

అదేమిటంటో.. చిరు సినిమాలో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న నటుడు సోనూసూద్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగానే ప్రకటించాడు. అంతేకాదు.. చిరుతో తెర పంచుకోవడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు సోనూ చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగని ఆయన.. దక్షిణాది చిత్రసీమ తనను ఆదరించి అక్కున చేర్చుకుంటోందని మురిసిపోయాడు. నిజంగా దక్షిణాది వాళ్లు చూపించే ప్రేమకు ఈ సినిమాతో ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నట్టు తన మనసులోని మాటను సోనూసూద్ బయటపెట్టాడు. మొత్తానికి చూస్తే ఆ కీలక పాత్ర అంటే బహుశా విలన్ పాత్ర అయి ఉంటుందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.