ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ నటుడు

  • IndiaGlitz, [Thursday,June 22 2017]

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'జైలవకుశ'. ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. అల్రెడి విడుదలైన ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్‌ విలన్‌ రోనిత్‌రాయ్‌ నటిస్తున్నాడట. అల్రెడి కన్నడ నటుడు దునియా విజయ్‌ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో నివేదా థామస్‌, రాశిఖన్నా, నందితరాజ్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నాడు. టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తాగ్యారేజ్ వంటి వ‌రుస విజ‌యాలు త‌ర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమాను అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగ‌టివ్ రోల్ చేస్తుండ‌టం విశేషం.

More News

'మా' టీమ్ ఆధ్వర్యంలో పరుచూరి వెంకటేశ్వరరావు పుట్టిన రోజు వేడుకలు

సీనియర్ రచయిత, `మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ) కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు పుట్టిన రోజు వేడుకలు `మా` టీమ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

బాలయ్యతో మూడోసారి...

నందమూరి బాలకృష్ణ, కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. బాలయ్య 102వ సినిమా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది.

విజయ్ టైటిల్

తమిళ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు తన 61వ సినిమాను శరవేగంగా పూర్తి చేసేస్తున్నాడు. రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో విజయ్ ఇది వరకే థెరి అనే సినిమా చేశాడు.

ఎన్టీఆర్ టీజర్ వస్తుంది...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్.రవీంద్ర(బాబి)దర్శకత్వంలో 'జై లవకుశ' సినిమా చేస్తున్నాడు.

రూమర్స్ ను నమ్మొద్దు..నేనే చెప్తా - రానా

ఆరడుగు అజానుభాహుడైన రానా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించకుండా కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నాడు.