మరో విషాదం.. దిగ్గజ నటుడు రిషి కపూర్ కన్నుమూత

బాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెంది 24 గంటలు గడవక మునుపే బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం దిగ్గజ నటుడు, సీనియర్ హీరో రిషి కపూర్ (67) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కాగా.. కేన్సర్‌తో పాటు తాజాగా శ్వాస కోస సమస్యతో కూడా ఆయన బాధపడుతున్నారని.. తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో బుధవారం ఉదయం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. గురువారం ఉదయం కన్నుమూశారు. ఇప్పటికే ఇర్ఫాన్ మరణంతో బాలీవుడ్ శోఖ సంద్రంలో ఉండగా ఇలా మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. ఇద్దరూ కూడా కేన్సర్‌తో చనిపోవడం బాధాకరం. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ అన్న విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల బాలీవుడ్, టాలీవుడ్ సినీ,రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇలా..

1952 సెప్టెంబర్ 4న జన్మించిన రిషికపూర్.. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తన కంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. 1980లో హీరోయిన్ నీతూ సింగ్‌ని పెళ్లాడారు. రిషికపూర్ కుమారుడే బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రణబీర్ కపూర్. రిషి కపూర్ 1973లో ‘బాబీ’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘దివానా’, ‘కాదల్’, ‘లైలా మజ్నూ’, ‘చాందినీ’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. 51 సినిమాల్లో నటించిన ఆయన 41 మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. ఈయనకు నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటు పలు అవార్డ్స్ దక్కాయి. బాలీవుడ్‌ను శాసించిన కపూర్ ఫ్యామిలి నుంచి ఆయన అగ్రశ్రేణి నటుడిగా ఎదిగారు. ఆయన సోదరుడు రణధీర్ కపూర్, కుమారుడు రణ్‌బీర్ కపూర్ కూడా హీరోలుగా రాణిస్తున్నారు.

More News

మగవారికే ‘కరోనా’ ఎక్కువగా సోకడం వెనుక..!

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ థాటికి ప్రపంచ దేశాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మృత్యువాతపడ్డారు.

‘ఆచార్య’ నుంచి కాజల్ కూడా ఔట్.. ఇందుకేనా!

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. కరోనా లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్ ఆగిపోయింది కానీ.. ఇప్పటికే సుమారు 70 శాతం

కరోనాకు వ్యాక్సిన్ రెడీ.. ఫస్ట్ ఇండియన్స్‌కే ఛాన్స్!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి కరోనా వైరస్‌కు ఇంతవరకూ మందు లేదు. అసలు మందు ఎప్పుడు తయారవుతుందో కూడా తెలియట్లేదు.

కంటతడి పెట్టిస్తున్న ఇర్ఫాన్ చివరి మాటలు!

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన కేన్సర్‌తో బాధపడుతూ బుధవారం నాడు తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. 2018 మార్చి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న

శ్రుతికి ఆ వాస‌నంటే ఇష్ట‌మ‌ట‌!!

యూనివర్సల్ స్టార్ కమల్‌హాస‌న్ త‌న‌య శ్రుతిహాస‌న్ కొన్నాళ్ల పాటు ప్రేమ‌, బ్రేకప్ వంటి కార‌ణాల‌తో సినీ రంగానికి దూర‌మైంది. అయితే ఇప్పుడిప్పుడే సినీ రంగంలో మ‌రో ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది.