Alia Bhatt: ఫస్ట్ నైట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన అలియా.. షాకైన కరణ్ జోహార్, వీడియో వైరల్

  • IndiaGlitz, [Wednesday,July 06 2022]

యుక్త వయసుకు రాగానే.. యువతీ యువకులు తమకు కాబోయే జీవిత భాగస్వామి ఇలా వుండాలి.. అలా వుండాలి. వాళ్లతో అది చేయాలి, ఇది చేయాలని కలలు కంటూ వుంటారు. ఇందుకోసం ప్లాన్డ్‌గా వెళ్లేవారు కూడా ఎందరో వున్నారు. ఇక పెళ్లి తర్వాత జరిగే ఫస్ట్ నైట్ గురించి కూడా ఎన్నో కలలు కంటారు . ఇది ఏ మనిషి జీవితంలోనైనా జరిగిదే. ఇందుకు సామాన్యులే కాదు, సెలబ్రెటీలు కూడా అతీతులేం కాదు. కానీ ఇలాంటి విషయాలు అంత తేలిగ్గా బయటకు రావు. కొన్ని ఇంటర్వ్యూల్లో యాంకర్లు , ఇతర జర్నలిస్టులు గుచ్చిగుచ్చి ప్రశ్నించినప్పటికీ ప్రముఖులు బయటపడరు. అయితే ఇలాంటి విషయాలు బయటకు తీసుకురావడంలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణో జోహార్ స్పెషలిస్ట్.

కాఫీ విత్ కరణ్‌కు గెస్ట్ గా అలియా - రణ్‌వీర్ సింగ్:

ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షోకు దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ వుంది. ఈ క్రమంలో లేటెస్ట్ సీజన్ కోసం ఆయన మళ్లీ రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే సమంతా ఈ చిత్రీకరణలో పాల్గొన్నట్లుగా వార్తలు వచ్చాయి.

అంత ఓపిక ఎవరికీ ఉండదు:

ఇకపోతే.. ఫస్ట్ ఎపిసోడ్ కు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, ఇటీవలే పెళ్లయిన అలియా భట్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అలియా భట్ ఫస్ట్ నైట్ గురించి కరణ్ ప్రశ్నించారు. దీనికి ఆమె ఏం సమాధానం చెబుతారా అని ఊహించగా.. జోహర్ కు షాకిచ్చినట్లుగా తెలుస్తోంది. నిజానికి తొలి రాత్రి లాంటిది అనేది వుండదని, అప్పటికి చాలా అలసిపోయి వుంటామని అలియా భట్ అన్నారు. మరి ఈ షోలో ఆమె చెప్పిన మరిన్ని విశేషాలు తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More News

Janasena Party : సమస్యలుంటే జనం చూపు ‘‘జనసేన’’ వైపే .. అండగా నిలుస్తాం : నాగబాబు

ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన ప్రధాన ధ్యేయమని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేసే వారిని, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరి సేవలను పార్టీ గౌరవిస్తుందన్నారు

Editor Gowtham Raju: ఎడిటర్ గౌతంరాజు కన్నుమూత.. శోక సంద్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు.

Gudipudi Srihari : పాత్రికేయ దిగ్గజం గుడిపూడి శ్రీహరి కన్నుమూత.. ఆయన రివ్యూలు గీటురాయిలా వుండేవి : పవన్ దిగ్భ్రాంతి

సీనియర్‌ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి మృతిపై జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Janasena Party : ఏపీకి వైసీపీ హానికరం.. ముద్దులు పెట్టేవాళ్లని నమ్మొద్దు : జనవాణిలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలను పాలకులు గుర్తుంచుకోవాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

RK Roja : మోడీ సభలో సందడంతా ఆమెదే : ప్రధాని , సీఎం, చిరంజీవితో సెల్ఫీ తీసుకున్న రోజా.. ఫోటోలు వైరల్

మన్యం వీరుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోమవారం ఘనంగా జరిగాయి.