close
Choose your channels

బాహుబలి మనసుకి బాలీవుడ్ భామ ఫిదా!!

Monday, August 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాహుబలి మనసుకి బాలీవుడ్ భామ ఫిదా!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటీనటులగా సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం ‘సాహో’. ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో భాగంగా శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను, ప్రభాస్ సీక్రెట్స్‌ను బయటపెట్టింది.

కంట్రోల్‌ చేసుకున్నా!

"‘సాహో’ సినిమాతో నేను టాలీవుడ్‌కు పరిచయం కావడం ఎంతో ఆనందంగా ఉంది. టాలీవుడ్ నాకు కొత్త పరిశ్రమ అని ఎప్పుడూ అనిపించలేదు. ఈ రెండేళ్ల ప్రయాణంలో గుర్తుండిపోయే జ్ఞాపకాలెన్నో. ఇంత కంటే బెస్ట్ డెబ్యూ లేదని అనుకుంటున్నాను. కథ వినగానే చాలా థ్రిల్ అయ్యాను. ప్రభాస్ హీరో అనగానే నా హ్యాపీనెస్ మూడు రెట్లు పెరిగింది. నా పాత్ర చాలా బావుంటుంది. ప్రభాస్‌తో లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ సీన్స్‌లో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. ఇండియన్‌ బిగ్గెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ట్రైలర్‌ చూశాక ఎగిరి గంతులు వేయకుండా, చప్పట్లు కొట్టకుండా నన్ను నేను కంట్రోల్‌ చేసుకున్నాను. తొలిసారి గన్‌ పట్టాను. పోలీసు పాత్ర చేశాను కాబట్టి, ఆ పాత్రపైన ఉన్న గౌరవం, ఈ సినిమా ప్రయాణంలో ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో యాక్షన్‌ ఘట్టాలు చేయడం అలవాటైంది" అన్నారు.

డార్లింగ్‌ను ఆకాశానికెత్తేసింది!

"ప్రభాస్ సూపర్‌స్టార్ మాత్రమే కాదు. ఆయన మనసు వెన్న. యూనిట్ మొత్తం ప్రభాస్ మంచి మనసుకి ఫిదా అయిపోయింది. చిత్రబృందం చూపించే ప్రేమాభిమానాల వల్ల ప్రతి రోజూ సెట్స్‌కి వెళ్లాలని అనిపించేది" అని ప్రభాస్‌ను ఈ ముద్దగుమ్మ రెబల్‌స్టార్‌ను ఆకాశానికెత్తేసింది. టాలీవుడ్‌లో శ్రద్దా నటించిన ఫస్ట్ మూవీ ‘సాహో’తో ఈ బాలీవుడ్ భామ ఏ మాత్రం మెప్పిస్తుందో తెలియాలంటే ఆగస్టు 30వరకు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.