రాజ్ తరుణ్ తో బాలీవుడ్ హీరోయిన్.....

  • IndiaGlitz, [Thursday,June 30 2016]

ఉయ్యాలా జంపాలా నుండి ఈడోర‌కం ఆడోర‌కం వర‌కు వ‌రుస విజయాలు సాధించిన యంగ్ హీరో రాజ్ త‌రుణ్ త్వ‌ర‌లోనే హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి చిత్రంలో న‌టించబోతున్నాడు. అయితే ఈ చిత్రానికి మారుతి క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నాడ‌ట‌. ఈ చిత్రాన్ని సంజ‌నారెడ్డి అనే లేడీ డైరెక్ట‌ర్ హ్యండిల్ చేయ‌నుంది. గ‌తంలో సంజ‌నారెడ్డి రాంగోపాల్ వ‌ర్మ ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసింది. రొమాంటిక్ కామెడి కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెర‌కెక్కనుంది.

ఈ చిత్రంలో న‌టకిరిటీ రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ అమైరా ద‌స్త‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్ప‌టికి రెండు, మూడు సార్లు తెలుగు నిర్మాత‌లు ఈ అమ్మ‌డుని తెలుగులో న‌టింప‌చేయాల‌నుకున్నారు కానీ కుద‌ర‌లేదు. కానీ ఇప్పుడు రాజ్‌త‌రుణ్ సినిమాలో న‌టించడం దాదాపు ఓకే అయిన‌ట్టేన‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. ప్రాజెక్ట్‌పై అమైరా ద‌స్త‌ర్ సైన్ చేయాల్సి ఉంది. గ‌తంలో ధ‌నుష్ న‌టించిన త‌మిళ డ‌బ్బింగ్ వెర్ష‌న్ అనేకుడు చిత్రంలో అమైరా మంచి న‌ట‌న‌తో మెప్పించింది.

More News

తిక్క సెట్ లో స్టైలిష్ స్టార్ సందడి...

సాయిధరమ్ తేజ్ హీరోగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో రోహిణ్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం తిక్క.

అతిగా ప్రేమించద్దు అంటున్న అల్లు శిరీష్..

అల్లుశిరీష్-లావణ్య త్రిపాఠి జంటగా పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు.

బన్నితో సినిమా చేస్తున్నాను - లింగుస్వామి

సరైనోడు తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తో సినిమా చేయడానికి తమిళ దర్శకుడు లింగుస్వామి సిద్ధమయ్యాడు.

ప్రభాస్ కజిన్ కూడా వస్తున్నాడు...

ఐదేళ్ళ క్రితం విడుదలైన కెరటం సినిమా చాలా మందికి గుర్తుండక పోవచ్చు.అందులో మన యంగ్ రెబల్ స్టార్ కజిన్ సిద్ధార్థ్ రాజ్ కుమార్ లీడ్ రోల్ లో నటించాడు.

ఫస్ట్ ఇండియన్ మూవీగా కబాలి న్యూరికార్డ్...

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ కబాలి.ఈ చిత్రాన్ని యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కించారు.ఈ చిత్రంలో రజనీ సరసన రాధికా ఆప్టే నటించారు.