బన్నీ జతగా బాలీవుడ్ హీరోయిన్

  • IndiaGlitz, [Saturday,August 24 2019]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల.. వైకుంఠపురంలో..’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల కానుంది. దీని తర్వాత బన్నీ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై సినిమా చేయబోతున్నారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా.. దీని తర్వాత దిల్‌రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ ‘ఐకాన్ కనపడుటలేదు’ అనే సినిమా చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశీఖన్నా నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఇప్పుడు దిశా పటానీ నటిస్తుందని అంటున్నారు. రాశీ స్థానంలో దిశాను తీసుకోవడానికి కారణమేంటి? అనే దానిపై క్లారిటీ లేదు. దిల్‌రాజు లేదా బన్నీ వర్గీయులే దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

దిశాపటానీ సినిమా కెరీర్‌ను టాలీవుడ్ నుండే స్టార్ట్ చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘లోఫర్’ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. తర్వాత బాలీవుడ్‌ వైపు అడుగులేసి ..హీరో టైగర్ ష్రాఫ్ గర్ల్ ఫ్రెండ్‌గా ఈ అమ్మడుగా బాగి సహా పలు చిత్రాల్లో నటించింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ పెరిగింది. ఒకప్పుడు ప్రాంతీయ సినిమాగానే ఉన్న తెలుగు సినిమా.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని శ్రద్ధాకపూర్, కియరా అద్వానీ వంటి హీరోయిన్స్ తెలుగులో సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో టాలీవుడ్‌తోనే కెరీర్‌ను స్టార్ట్ చేసిన దిశాపటానీ.. మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యిందని అంటున్నారు. బన్నీ వంటి స్టార్ హీరో సినిమాలో నటించడం వల్ల దిశా పటానీ .. ఇక్కడ మరికొంత మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.

More News

ఆగ‌స్టు 25 న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా ఎస్వీఆర్ కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

విశ్వ న‌ట‌చ‌క్ర‌వ‌ర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్ర‌హాన్ని తాడేప‌ల్లి గూడెం య‌స్.వి.ఆర్. స‌ర్కిల్, కె.య‌న్.రోడ్ లో ఆవిష్క‌రించ‌నున్నారు.

రాజధాని అమరావతిపై బొత్సా తాజా ప్రకటన ఇదీ...

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రి బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం విదితమే.

జగన్‌ సర్కార్‌కు ఝలక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం!

పోలవరం రివర్స్ టెండరింగ్‌పై ఇప్పటికే వైఎస్ జగన్‌ సర్కార్‌కు ఏపీ హైకోర్టు జలక్ ఇచ్చిన విషయం విదితమే.

వైసీపీ సోషల్ మీడియాపై సైబర్ క్రైంకు జనసేన ఫిర్యాదు

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బర్త్ డే గిఫ్ట్‌లు ఇస్తున్నారంటూ వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నామని జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ తెలిపారు.

ముంపుకు గురైన లంక గ్రామాలను సర్కార్ ఆదుకోవాలి!

వరద ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు, పనులు లేక ఇబ్బందిపడుతున్న వ్యవసాయ కూలీలకు ఆరు నెలలపాటు నష్టపరిహారం చెల్లించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు,