బన్నీ డాన్స్ చూసి షాకైన బాలీవుడ్ హీరోయిన్‌!!

  • IndiaGlitz, [Tuesday,March 31 2020]

టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో డాన్సులు చ‌య‌డంలో మెగా క్యాంప్‌ హీరోల‌కు పెట్టింది పేరు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న డాన్సుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బ‌న్నీ డాన్సుల‌కు ప్రేక్ష‌కులే కాదు.. సినీ స్టార్స్ కూడా ఫిదా అవుతుంటారు. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ కూడా చేరింది. రీసెంట్‌గా ఆమె అల్లు అర్జున్ హీరోగా న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలో బుట్ట‌బొమ్మ వీడియో సాంగ్‌ను చూసింది. అందులో వాలుత‌లంపై జారుతూ బ‌న్నీ వేసిన స్టెప్ సింప్లీ సూప‌ర్బ్‌. ఈ స్టెప్ ఉన్న వీడియోను పోస్ట్ చేసిన దిశా ప‌టానీ..ఇదెలా చేశావ్ అంటూ త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దిశా మెసేజ్ చూసిన అల్లు అర్జున్ రిప్లై కూడా ఇచ్చాడు. ‘‘నాకు మ్యూజిక్‌ అంటే ఇష్టం. మంచి మ్యూజిక్ వ‌చ్చిన‌ప్పుడు బాగా డాన్స్ చేస్తాను. మీ ప్ర‌శంస‌ల‌కు థాంక్స్‌’’ అని రిప్లై ఇచ్చారు.

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ‘అల వైకుంఠ‌పుర‌ములో’ భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. బ‌న్నీ కెరీర్‌లోనే కాదు.. బాహుబ‌లి త‌ర్వాత భారీ హిట్ అయిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో పాట‌లు సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యాయి. సినిమా విడుద‌ల త‌ర్వాత వ‌చ్చిన బుట్ట‌బొమ్మ వీడియో సాంగ్‌కు బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ శిల్పాశెట్టిలాంటివారు కూడా టిక్ టాక్ వీడియోలో డాన్స్ చేయ‌డాన్ని మ‌నం చూశాం.

More News

వేడుక‌ల‌ను ఆపేసిన బ‌న్నీ.. ఏం చేశాడో తెలుసా?

చాలా పెద్ద హిట్ కోసం వెయిట్ చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోరిక ఈ ఏడాది తీరిపోయింది. బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠ‌పుర‌ములో

మ‌రోసారి మెగా సంద‌డి.. ‘ఆచార్య’ ఫ‌స్ట్ లుక్ డేట్‌

ఉగాదికి మెగా సంద‌డి నెల‌కొంది. ఒక ప‌క్క జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తోన్న భారీ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’ మోషన్ పోస్టర్‌ను విడుద‌ల చేశారు.

మ‌రో క్రేజీ సినిమాలో పూజా హెగ్డే!

పొడుగు కాళ్ల సొగ‌స‌రి పూజా హెగ్డే ప్ర‌స్తుతం టాలీవుడ్ క్రేజీ సినిమాల్లో న‌టిస్తుంది. ఈ ఏడాది ఈ అమ్ముడు బ‌న్నీతో క‌లిసి న‌టించిన ‘అల వైకుంఠ‌పుర‌ములో’ భారీ విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే.

త‌నదైన మార్కుతో మారుతి

మారుతి.. ఆయ‌న కెరీర్ స్టార్ట్ అయిన ప్రారంభంలో ఉన్న‌ప్ప‌టికీ, ఇప్ప‌టికీ చాలా మార్పు క‌న‌ప‌డుతుంది. మినిమ‌మ్ బ‌డ్జెట్‌తో, మినిమం హిట్ సినిమాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుకున్నాడు మారుతి.

రకుల్ ప్రీత్ కు బాలీవుడ్ ఆఫర్

పంజాబీ ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్ ద‌క్షిణాదిన తెలుగు, త‌మిళ చిత్రాల‌తో బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. అయితే ఒక‌ప్పుడు ఉన్నంత స్పీడుగా ర‌కుల్ కెరీర్ లేద‌నేది వాస్త‌వం.