బాలీవుడ్ బాబా..

  • IndiaGlitz, [Wednesday,July 12 2017]

బాబా అంటే ప‌కీర్ కాదులెండి..ర‌జ‌నీకాంత్ బాబా సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాప‌డింది. సినిమాను కొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్ భారీగా న‌ష్టాల‌ను చ‌వి చూశారు. ఆ సినిమాకు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వ్య‌వ‌హ‌రించిన ర‌జ‌నీకాంత్ డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు డ‌బ్బులు తిరిగి ఇచ్చేసి వారిని ఆదుకున్నాడు. ఇప్పుడు అలాంటి సిచ్యువేష‌న్ స‌ల్మాన్‌ఖాన్‌కు ఎదురైంది. స‌ల్మాన్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ నిర్మించిన చిత్రం 'ట్యూబ్‌లైట్‌'. జూన్ 23న విడుద‌లైన ఈ చిత్రం ప్లాప్ అయ్యింది.

సాధార‌ణంగా స‌ల్మాన్ సినిమాలు విడుద‌లైన వారంలోపే వంద‌కోట్ల మైలురాయిని సుల‌భంగా దాటేస్తుంటాయి. కానీ 'ట్యూబ్‌లైట్‌' సినిమా విడుద‌లైన రోజు నుండి ఈరోజు వ‌ర‌కు కేవ‌లం 110 కోట్లు మాత్ర‌మే క‌లెక్ట్ చేసింది. సినిమాను కొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్ న‌ష్ట‌పోవ‌డంతో వారిని ఆదుకోవ‌డానికి స‌ల్మాన్ ముందుకొచ్చాడు. 55 కోట్ల రూపాయ‌ల‌ను డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు ఇస్తున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని యూనిట్ వ‌ర్గాలు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశాయి.

More News

మహాభారతానికి సంబంధమేంటి?

మన ఇతిహాసాల్లో మహాభారతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.

పుకార్లను ఖండిన టాలీవుడ్ జంట

పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన వరుణ్ సందేష్, వితిక శేరు రియల్ లైఫ్లో కూడా ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి గత ఏడాది ఆగస్టులో ఒకింటివారయ్యారు.

జూలై 16న 'గౌతమ్ నంద' ఆడియో విడుదల

మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రేపు 'జయ జానకి నాయక' టీజర్ !!

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా

పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ భామ

తండ్రి అనీల్ కపూర్ బాటలోనే సినీ తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ సోనమ్కపూర్. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందనే వార్తలు బాలీవుడ్ వర్గాల్లో గుప్పుమంటుంది.