‘స‌లార్’ కోసం బాలీవుడ్ బ్యూటీ ఐటెం సాంగ్‌...

  • IndiaGlitz, [Monday,February 08 2021]

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు వ‌రుస‌గా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ‘రాధేశ్యామ్‌’ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉండ‌గా .. ‘స‌లార్, ఆదిపురుష్’అనే మ‌రో రెండు ప్యాన్ ఇండియా సినిమాల‌ను ప్ర‌భాస్ సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ రెండింటిలో ‘స‌లార్’ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ మూవీ ఇది. ప్ర‌స్తుతం గోదావ‌రి ఖ‌నిలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.

కాగా.. ఈ సినిమాలో ప్ర‌శాంత్ నీల్ త‌న‌దైన స్టైల్‌ను ఫాలో అవుతూ ఓ ఐటెమ్ సాంగ్‌ను ప్లాన్ చేశాడు. ప్యాన్ ఇండియా మూవీ కాబ‌ట్టి ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను చిందేయిస్తే బావుంటుంద‌ని భావించాడ‌ట ప్ర‌శాంత్ నీల్‌. అందులో భాగంగా దీపికా ప‌దుకోన్‌ను సంప్ర‌దించార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎలాగూ ప్ర‌భాస్‌తో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించ‌బోయే సినిమాలో దీపికా ప‌దుకోన్ హీరోయిన్. ఆ సినిమా కంటే ముందుగానే ఓ ఐటెమ్ సాంగ్‌లో న‌టించ‌డానికి దీపికా ఒప్పుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర‌యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

More News

పోర్న్ వీడియో రాకెట్‌లో అరెస్ట్ అయిన హీరోయిన్‌...!

హిందీ, తెలుగు చిత్రాల్లో న‌టించిన న‌టి, మోడ‌ల్ గెహ‌నా వ‌శిష్ట్‌ను ముంబై పోలీసులు పోర్న్ కేసులో అరెస్ట్ చేశారు.

ఏపీ హైకోర్టులో ఎస్ఈసీకి చుక్కెదురు.. పెద్దిరెడ్డికి గ్రీన్ సిగ్నల్ 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు చుక్కెదురైంది. పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది.

పవర్‌స్టార్‌ దగ్గర పని చేశాడు... మాస్‌ మహారాజా దగ్గరకొచ్చాడు!

మాస్‌ మహారాజా రవితేజ ప్రజెంట్‌ ‘ఖిలాడి’ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత కొత్త దర్శకుడికి ఛాన్స్‌ ఇవ్వబోతున్నాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

‘ఆదిపురుష్‌’ను ‘రాధేశ్యామ్‌’ ఫాలో అవుతున్నాడా?

ప్రభాస్‌ రూటు మార్చాడు. అభిమానులకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. అవన్నీ స్వీట్‌ షాకులే అనుకోండి.

ఫిబ్రవరి నెలాఖరున సత్తారు సెట్‌కి కింగ్‌

‘గరుడవేగ’ సినిమాతో దర్శకుడిగా ప్రవీణ్‌ సత్తారు సత్తా ఏమిటో ఇండస్ట్రీకి తెలిసింది. సెన్సిబుల్‌ సినిమా ‘చందమామ కథలు’ తీసిన వ్యక్తిలో ఇంత విషయం ఉందా?