close
Choose your channels

మ‌హేశ్ ఆఫ‌ర్‌ని తిర‌స్క‌రించిన బాలీవుడ్ బ్యూటీ

Monday, September 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌హేశ్ ఆఫ‌ర్‌ని తిర‌స్క‌రించిన బాలీవుడ్ బ్యూటీ

ప్ర‌స్తుతం బాలీవుడ్, సౌత్ సినిమాల మ‌ధ్య అంత‌రాలు త‌గ్గిపోతున్నాయి. అంద‌రూ క‌లిసిపోతున్నారు. అక్క‌డి టెక్నీషియ‌న్స్, న‌టీన‌టులు మ‌న ద‌క్షిణాదిలో ప‌నిచేస్తుంటే.. మ‌న‌వారు బాలీవుడ్‌సినిమాల్లో న‌టిస్తున్నారు. బాహుబ‌లి, సాహో, కె.జి.య‌ఫ్‌తో ద‌క్షిణాది సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలుగా విడుద‌ల‌వుతున్నాయి. కాగా.. నార్త్ హీరోయిన్స్ మ‌న ద‌క్షిణాది సినిమాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు. అయితే క‌థ‌, వారి పాత్ర‌ల తీరు తెన్నులు న‌చ్చితేనే. `సాహో`లో ప్ర‌భాస్ జ‌త‌గా శ్ర‌ద్ధాక‌పూర్ న‌టించింది. కాగా.. ఇప్పుడు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 26వ చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. ఇందులో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో త‌మ‌న్నా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ముందుగా ఈ సాంగ్‌లో త‌మ‌న్నాని కాకుండా సోనాక్షి సిన్హాను న‌టింప చేయాల‌ని అనుకున్నార‌ట‌.

సోనాక్షిని సంప్ర‌దిస్తే ఆమె కూడా న‌టించ‌డానికి ఓకే చెప్పింద‌ట‌. అయితే ముందు త‌న‌కు ఆ సాంగ్‌ను పంప‌మ‌ని కోరింద‌ట. అయితే ఆ స్పెష‌ల్ సాంగ్ ట్యూన్ ఇంకా త‌యారు కాలేదని, సినిమా చివ‌ర్లో చిత్రీక‌రిస్తామ‌ని తెలిపారు. అయితే సోనాక్షి అక్క‌డే మెళిక పెట్టి తన‌కు పూర్తి సాంగ్ ఇస్తే కానీ నిర్ణ‌యించుకోలేన‌ని తేల్చేసింది. దీంతో మ‌హేశ్ అండ్ టీమ్ త‌మ‌న్నాను సంప్ర‌దించారు. అయితే త‌మ‌న్నా తండ్రి త‌మ‌న్నా డేట్స్ ప్ర‌స్తుతానికి ఖాళీగా ఉన్నాయ‌ని, త్వ‌ర‌గా అడ్వాన్స్ ఇచ్చేయ‌మ‌ని తొంద‌ర పెట్ట‌డంతో నిర్మాత‌లు త‌మ‌న్నాకు అడ్వాన్స్ చెల్లించేశార‌ట‌. ఇలా సోనాక్షి స్థానంలో త‌మ‌న్నా వ‌చ్చి చేరింది.

శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, జి.ఎం.బి సినిమాస్‌, ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై అనీల్ సుంక‌ర‌, దిల్‌రాజు, మ‌హేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.