close
Choose your channels

ఇస్మార్ట్‌పై బాలీవుడ్ క‌న్ను

Friday, October 4, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇస్మార్ట్‌పై బాలీవుడ్ క‌న్ను

ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు హ్యూజ్ హిట్ సాధించిన చిత్రాల్లో `ఇస్మార్ట్ శంక‌ర్` ఒక‌టి. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మి కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ చిత్రం భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. సినిమాను కొన్న బ‌య్య‌ర్లంద‌రికీ లాభాలు వ‌చ్చాయి. అయితే త్వ‌ర‌లోనే ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్నార‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ప్ర‌ముఖ హీరో ర‌ణ‌వీర్ సింగ్ ఈ రీమేక్లో న‌టిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఆరు నెల‌లో వ్య‌వ‌థిలో రెండు తెలుగు సినిమా రీమేక్‌లు బాలీవుడ్‌లో విడుద‌లై ఘ‌న విజయాల‌ను సాధించాయి. టెంప‌ర్ సినిమాను సింబాగా రీమేక్ చేశారు. ఇందులో ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా న‌టించారు. అలాగే అర్జున్ రెడ్డి చిత్రాన్ని క‌బీర్‌సింగ్ పేరుతో రీమేక్ చేశారు. ఇందులో షాహిద్ క‌పూర్ హీరోగా చేశాడు. ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ రీమేక్‌లోనూ ర‌ణ‌వీర్ సింగ్‌ను న‌టింప చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయట‌. అంతా ఓకే అయితే త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.

మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` ఈ జూలై నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. మరి హిందీ రీమేక్‌ను ఎవ‌రు డైరెక్ట‌ర్ చేస్తార‌నే తెలియాల్సి ఉంది. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంద‌ని స‌మాచారం. తెలుగులో నిధి అగ‌ర్వాల్‌, న‌భాన‌టేశ్ హీరోయిన్స్‌గా న‌టించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.