అఖిల్ అమ్మగా బాలీవుడ్ హీరోయిన్..

  • IndiaGlitz, [Thursday,June 01 2017]

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్ష‌కులకు ట‌బు అంటే సుప‌రిచిత‌మే. ఈ అమ్మ‌డు నాగార్జున‌తో నిన్నే పెళ్ళాడ‌తా, ఆవిడా మా ఆవిడే వంటి చిత్రాల్లో న‌టించింది. ఇప్పుడు మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, నాగార్జున‌తో జోడి క‌ట్టిన ఈ భామ ఇప్పుడు అఖిల్ సినిమాలో తల్లి పాత్ర‌లో న‌టించ‌నుంద‌ట‌.

అఖిల్ హీరోగా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమాలో టబు త‌ల్లి పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే అఖిల్ సినిమా యాక్ష‌న్ పార్ట్ అంతా పూర్తి చేసేసుకుంది. మ‌నం, 24 చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ త‌న‌దైన స్ట‌యిల్లో అఖిల్‌ను స‌రికొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ట‌. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు.

More News

కల్యాణ్ రామ్ తో జోడిగా...

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో

బాలీవుడ్ నటుడే ప్రభాస్ విలన్...

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయిపోయాడు.

అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు...

విలక్షణమైన ప్రేమకథలు,యాక్షన్ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు గౌతమ్ మీనన్ నాలుగు భాషల్లో

బాహుబలిపై కన్నేసిన '2.0'

సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి రోబో చిట్టిగా తన మాయాజాలాన్ని తెరపై చూపించడానికి రెడీ అవుతున్నాడు. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ రోబో సీక్వెల్గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

సూసైడ్ డిసీజ్ తో బాధపడుతున్న సల్మాన్...

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ త్వరలోనే ట్యూబ్ లైట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమాలో బిజీగా ఉన్న ఈ సూపర్ స్టార్ అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే గత ఏడున్నరేళ్ళుగా సల్మాన్ఖాన్ ట్రైజెమినల్ న్యూరాల్జియా వ్యాధితో బాధపడుతున్నాడట.