ప్రభాస్ తో బాలీవుడ్ హీరోయిన్...

  • IndiaGlitz, [Saturday,May 13 2017]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ 'బాహుబ‌లి2' స‌క్సెస్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు అమెరికాలో స‌మ్మ‌ర్ వెకేష‌న్‌లో ఉన్న ప్ర‌భాస్ స‌మ్మ‌ర్ త‌ర్వాత రెండు సినిమాల‌కు ప‌నిచేయ‌నున్నాడు. అందులో ఒక‌టి సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో కాగా, మ‌రో సినిమా జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. సాహో సినిమా అల్రెడి స్టార్ట్ కావ‌డంతో సినిమా సెట్స్‌లోకి ముందుగా వెళుతుంది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ క‌త్రినా కైఫ్‌ను న‌టింప చేయాల‌ని యూనిట్ వ‌ర్గాలు భావిస్తున్నాయ‌ట‌. తెలుగులో వెంక‌టేష్ మ‌ల్లీశ్వ‌రి, బాల‌కృష్ణ అల్ల‌రి పిడుగు సినిమాల త‌ర్వాత క‌త్రినా మ‌రే సినిమా చేయ‌లేదు. మ‌రి ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్టేట‌స్‌ను ఎంజాయ్ చేస్తున్న క‌త్రినా టాలీవుడ్ హీరో ప్ర‌క్క‌న న‌టించ‌డానికి ఒప్పుకుంటుందా అని చూడాలి. సాహో తెలుగు, త‌మిళం, హిందీల్లో 150 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంద‌నుంది.

More News

మే13న 'రారండోయ్.. వేడుక చూద్దాం' థియేట్రికల్ ట్రైలర్

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్కృష్ణ

ఇండియాలోనే 1000 కోట్ల 'బాహుబలి-2'

ప్రభాస్,రానా,అనుష్క,సత్యరాజ్,రమ్యకృష్ణ తారాగణంగా రాజమౌళి రూపొందించిన విజువల్ వండర్ బాహుబలి చిత్రంలో

కల్యాణ్ రామ్ తో మరోసారి...

హీరో,నిర్మాత అయిన నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ప్రస్తుతం తమ్ముడు

పూరి మరోసారి ఆమెతో ప్లాన్ చేస్తున్నాడా?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన పోకిరి సినిమా అప్పట్లో కొత్త బాక్సాఫీస్ రికార్డులకు తెర తీసింది. ముఖ్యంగా ఈ సినిమా ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..అనే సెన్సేషన్ క్రియేట్ చేసింది.