చిరంజీవి - కొరటాల చిత్రానికి బాలీవుడ్ టచ్

  • IndiaGlitz, [Tuesday,October 22 2019]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్‌' సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా మ‌రో ప‌క్క నిర్మాత‌గా కూడా బిజీ బిజీగా ఉన్నారు. తండ్రి మెగాస్టార్ 152వ సినిమాకు రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమాకు కూడా చ‌ర‌ణ్ బాలీవుడ్ రంగులు అద్దుతున్నాడ‌ని స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే.. చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌బోతున్న చిత్రానికి బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కులు అజ‌య్ అతుల్ కాంబినేష‌న్‌ను ప‌నిచేయించ‌డానికి నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని టాక్‌. ఇప్ప‌టి వ‌ర‌కు కొర‌టాల శివ సినిమాకు దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందించారు. అయితే ఈ కాంబినేష‌న్‌కు ఇప్పుడు బ్రేక్ ప‌డ‌నుంది.

ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. దేవాల‌యాల్లో జ‌రిగే అక్ర‌మాల‌పై సినిమా క‌థ‌ను కొర‌టాల శివ‌ త‌యారు చేశార‌ని టాక్‌. చిరంజీవి రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌న‌ప‌డ‌తార‌ట‌. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ కూడా న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు.