రజనీకాంత్ సినిమాకు బాలీవుడ్ సీక్వెల్

  • IndiaGlitz, [Monday,August 19 2019]

సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రధారులుగా రూపొందిన సైకలాజికల్ హారర్ ఎంటర్ టైనర్ 'చంద్రముఖి'. స్ల్పిట్ పర్సనాలిటీ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. నిజానికి ఇది మలయాళ చిత్రం 'మణిచిత్రాతాలు' సినిమాకు రీమేక్. పి.వాసు ఈ రీమేక్‌ను తెరకెక్కించారు. దీన్ని బాలీవుడ్‌లో బోల్ భులయ్యా పేరుతో ప్రియదర్శన్ 2007లో రీమేక్ చేశారు.

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రధారిగా నటించారు. దాదాపు పుష్కరకాలం తర్వాత ఈ చిత్రానికి బాలీవుడ్‌లో సీక్వెల్ రూపొందనుంది. 'బోల్ భులయ్యా 2' పేరుతో తెరకెక్కబోయే ఈ సీక్వెల్‌లో అక్షయ్‌కుమార్ నటించడం లేదట. ఆయన స్థానంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. అనీజ్ బాజ్మీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలై 31న విడుదల చేయనున్నారు.

More News

'ఎవరు' తో శేష్ హ్యాట్రిక్ కొట్టేశాడు: బన్నీ

క్షణం, గూఢచారి చిత్రాల తర్వాత అడివిశేష్, ఎవరు`తో  హ్యాట్రిక్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని బన్నీ కూడా అంగీకరించాడు.

మెహ‌ర్ ఈజ్ బ్యాక్‌!

తెలుగు తెర‌కు స్టైలింగ్ చేసి, ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ లో క‌ల‌రింగ్ ఇచ్చిన డైర‌క్ట‌ర్ల‌ను గురించి ప్ర‌స్తావించాల్సి వ‌చ్చిన‌ప్పుడు మెహ‌ర్ ర‌మేష్ పేరు త‌ప్ప‌క ఉంటుంది.

నిజ‌మేనా.. ఆమేనా.. ప్ర‌భాస్‌?

`సాహో` ప్రీ రిలీజ్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ప్ర‌భాస్ అండ్ టీమ్ ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌చారప‌ర్వం సాగిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఎక్క‌డ ఎవ‌రితో ఏం మాట్లాడినా న్యూస్ అవుతోంది.

జూనియ‌ర్ బెల్లం క‌మింగ్‌!

బెల్లంకొండ జూనియ‌ర్... బెల్లంకొండ గ‌ణేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి స‌ర్వం సిద్ధ‌మ‌వుతోంది.

హీరో వెంక‌టేశ్‌కి స్వ‌ల్ప‌గాయం

విక్ట‌రీ వెంక‌టేశ్‌కి షూటింగ్‌లో చిన్న‌పాటి గాయాల‌య్యాయి. నాగ‌చైత‌న్య‌తో క‌లిసి వెంకీ న‌టిస్తోన్న చిత్రం `వెంకీమామ‌`.