Kannappa:మంచు విష్ణు గట్టిగానే ప్లాన్ చేశాడుగా.. 'కన్నప్ప' మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో

  • IndiaGlitz, [Tuesday,April 16 2024]

మంచు కుటుంబం డ్రీమ్ ప్రాజెక్టు అయిన 'కన్నప్ప' (Kannappa) మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. శివుడికి వీరభక్తుడైన కన్నప్ప జీవితచరిత్ర అధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్ని భాషల నుంచి అగ్ర నటులు నటిస్తుండటం విశేషం. కన్నడ నుంచి శివరాజ్‌ కుమార్‌, మలయాళం నుంచి మోహన్‌లాల్‌ తమిళం నుంచి శరత్‌ కుమార్‌ నటిస్తున్నారు.

ఇక తెలుగు నుంచి ప్రభాస్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ కూడా మూవీలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. షూటింగ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అక్షయ్‌కు మంచు విష్ణు, మోహన్‌బాబు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా అక్షయ్‌కి శాలువా కప్ప మోహన్ బాబు సత్కరించారు. ఈ విషయాన్ని విష్ణు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశాడు. సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఎంట్రీతో 'కన్నప్ప' మూవీ జర్నీ మరింత థ్రిల్లింగ్‌గా మారింది. ఈ మూవీతో అక్షయ్‌ కుమార్‌ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారని ప్రకటించడం చాలా సంతోషంగా, థ్రిల్‌గా ఫీలవుతున్నాను. ఎప్పటికీ మర్చిపోలేని అడ్వెంచర్‌కి రెడీ అవ్వండి అంటూ పోస్ట్ చేశాడు.

గతంలో తమిళంలో రోబో2.0 ద్వారా దక్షిణాది ప్రేక్షకులను పలకరించిన అక్షయ్.. ఇప్పుడు తెలుగు సినిమా ద్వారా అలరించనున్నాడు. స్టార్ ప్లస్‌లో మహాభారతం సీరియల్‌ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజ్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

ఇందులో భాగంగా అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెచా ఫైట్స్ చేస్తుండగా.. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్ర కథకి కీలక మెరుగులు దిద్దారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి భారీ తారాగణంతో పాటు సాంకేతిక వర్గంతో ఓ రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ హిట్ కొట్టాలని మంచు విష్ణు గట్టి పట్టుదలతో ఉన్నాడు.

More News

CM Jagan:సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పురోగతి.. నిందితుడిని గుర్తించిన పోలీసులు

సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనకు సంబంధించి ఏర్పాటుచేసిన సిట్ దర్యాప్తులో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది.

Gaami :జీ5లో ‘గామి’ సెన్సేషన్.. 72 గంటల్లోపు 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్..

తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ముందు వరుసలో ఉంటుంది.

CM YS Jagan: దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్‌ రాశాడు.. రాయి దాడిపై సీఎం జగన్ స్పందన ఇదే..

తనపై జరిగిన రాయి దాడిపై సీఎం జగన్ స్పందించారు. గుడివాడలోని నాగవరప్పాడు వద్ద జరిగిన 'మేమంతా సిద్ధం' సభలో తన గాయం గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Chiranjeevi: బీజేపీ అభ్యర్థికి చిరంజీవి మద్దతు.. నేనున్నాను అంటూ భరోసా..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పూర్తిగా సినిమాలకే అంకితమయ్యారు. కానీ రాజకీయాల్లో తన మద్దతు మాత్రం కొంతమందికి తెలియజేస్తున్నారు.

Pawan Kalyan: సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనకు ఆ నలుగురిదే బాధ్యత: పవన్ కల్యాణ్

ఏపీ సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికారుల చేతే విచారణ చేయించడం సరికాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు.