బాలీవుడ్ టు హాలీవుడ్...

  • IndiaGlitz, [Wednesday,July 19 2017]

హాలీవుడ్ చిత్రాల్లోని స‌న్నివేశాల‌ను టెక్నాలజీని మ‌న సినిమావాళ్లు ఫాలో అవుతుంటారు. కానీ తొలిసారి హాలీవుడ్ సంస్థ, బాలీవుడ్ సినిమాను రీమేక్ చేయ‌నుంది. ఇంత‌కు ఆ సినిమా మ‌రేదో కాదు, హృతిక్‌, యామీ గౌత‌మ్ న‌టించిన చిత్రం 'కాబిల్‌'. ఈ విష‌యాన్ని 'కాబిల్‌' చిత్ర ద‌ర్శ‌కుడు సంజ‌య్ గుప్తా తెలియ‌జేశారు.

ప్ర‌ముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఫాక్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఈ సినిమాను నిర్మించ‌నుంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికార‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. హృతిక్ ఇప్పుడు పారిన్ టూర్‌లో ఉన్నాడు. త‌ను ఇండియాకు రాగానే విష‌యాన్ని తెలియ‌జేస్తార‌ట‌. ఈ చిత్రంలో హృతిక్‌, యామీ ఇద్ద‌రూ అంధులుగా న‌టించారు. ఓ అంధుడు త‌న కుటుంబానికి జ‌రిగిన అన్యాయానికి తెలివిగా ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడ‌నేదే క‌థ‌.

More News

ఐదు కోట్ల సాంగ్...

సూపర్స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్నచిత్రం రోబో సీక్వెల్ `2.0`.ఒక సాంగ్ మినహా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ఈ సాంగ్ మాత్రం భారీ స్థాయిలో రూపొందనుందట.

శ్రుతిపై కామెంట్స్ విసిరిన ఖుష్బూ..

సీనియర్ నటి ఖుష్బూ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే. తమిళ దర్శక నిర్మాత సుందర్.సి ని విహహాం చేసుకుంది. తమిళ రాజకీయాల్లో బిజీగా ఉంది. తమిళనాటు ఖుష్బూ హీరోయిన్గా చేసిన రోజుల్లో ఆమెకు వీరాభిమానులుండేవారు.

గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు..

హైదరాబాద్ లోని గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమికి కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించింది.. గత 15 ఏళ్లుగా పిల్మ్, టివి రంగానికి చెందిన పలు విభాగాలలో శిక్షణ ఇస్తున్న ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్ మెంట్ సంస్థకు అనుబంధంగా ఉన్న మీడియా, స్కిల్ కౌన్సిల్ అధికారికంగా ఈ గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమికి గుర్తింపు ఇచ్చింది.

టాలీవుడ్ తెరంగేట్రానికి సిద్ధమవుతున్న శివాని రాజశేఖర్

శివాని రాజశేఖర్,ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది.

ప్రతివాళ్ళ జీవితంలో జరిగే పోరాటమే మా 'పోరాటం' నిర్మాత శ్రీనివాస్ రావు

K3 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ రావు నిర్మాతగా .. మహేంద్రన్,వినోద్ ,తను శెట్టి ,ఐశ్వర్య హీరో హీరోయిన్స్ గా తెలుగు,తమిళ్ కన్నడ బాషల్లో తెరకెక్కిన చిత్రం పోరాటం.