close
Choose your channels

విడుద‌ల‌కు సిద్ధ‌మైన సైన్స్ ఫిక్ష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌ 'బొంభాట్‌'

Monday, November 4, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విడుద‌ల‌కు సిద్ధ‌మైన సైన్స్ ఫిక్ష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌ బొంభాట్‌

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై `ఈన‌గ‌రానికి ఏమైంది` ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా.. రాఘ‌వేంద్ర వర్మ(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాస్ హ‌న్నూర్‌క‌ర్ నిర్మిస్తున్న సైన్స్ ఫిక్ష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ `బొంభాట్`‌ అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. రీసెంట్‌గా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ - ``యంగ్ బ్ల‌డ్ క‌లిసి చేసిన `బొంభాట్` ఫ‌స్ట్ లుక్‌ బావుంది. సుశాంత్, సిమ్రాన్‌, చాందిని, మ‌క‌రంద్ దేశ్ పాండే కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జోష్.బి నాకు మంచి స్నేహితుడు. త‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా సంగీత సారథ్యం వహించారు. త్వరలో పాటలు మార్కెట్ లోకి రాబోతున్నాయి. ఈ సినిమా క‌లెక్ష‌న్స్‌తో బొంభాట్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.