ప్రియా ప్రకాశ్‌కు బోనీ కపూర్ నోటీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక చిన్న పిల్ల .. ఓ అమ్మాయిని మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? అని అడిగితే నాకు నచ్చిన హీరోయిన్ నేనే! నా పేరు శ్రీదేవి అని చెబుతుంది. ఇది శ్రీదేవి బంగ్లా సినిమాలోని డైలాగ్. చిన్నగా కన్నుగీటి నేషనల్ వైడ్ ఫేమస్ అయిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఇప్పుడు 'శ్రీదేవి బంగ్లా' చిత్రంలో నటిస్తుంది. ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమా టీజర్ రీసెంట్గా విడుదలైంది. ఇందులో హీరోయిన్ పేరు శ్రీదేవి ..శ్రీదేవి జీవిత చరిత్రను పోలినట్టు సినిమా.. చివరగా బాత్ టబ్‌లో ఓ అమ్మాయి పాదాలు పైకి కనపడేలా ఉండటంతో ఇది శ్రీదేవి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన సినిమాగా భావిస్తున్నారందరూ.
శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూడా అలాగే భావించి చిత్ర యూనిట్‌కు లీగల్ నోటీసులను పంపాడు. అయితే సినిమా చూస్తేనే కదా! ఇది ఏ సినిమానో తెలుస్తుంది. మేం కేసును ధైర్యంగా ఎదుర్కొంటాం అంటూ దర్శకుడు ప్రశాంత్ మాంబుల్లి చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.