close
Choose your channels

శ్రీదేవి బయోపిక్‌కి బోనీ నిర్మాత

Monday, January 7, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీదేవి బయోపిక్‌కి బోనీ నిర్మాత

జాతీయ స్థాయిలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఒకరు అందాల తార శ్రీదేవి. దక్షిణాది చిత్రాలతోపాటు హిందీలోనూ పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన ఆమె హఠాత్తుగా చనిపోవడం అందర్నీ బాధించింది. దేశవ్యాప్తంగా చక్కని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆమె జీవితాన్ని తెరకెక్కించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే వాళ్ళందరి కంటే శ్రీదేవి బయోపిక్‌ను నిర్మించే అర్హత తనకే ఉందని ఆమె భర్త బోనీకపూర్ భావిస్తున్నారు. "శ్రీదేవి బయోపిక్‌ను తియ్యాలన్న ఆలోచన బోనీ కపూర్‌ది. ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.

శ్రీదేవి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి బోనీ కపూర్ కావడంతో ఆ సినిమాకు అతని వల్లే న్యాయం జరుగుతుంది. ఆమె జీవితంపై సినిమా తీసేందుకు కాపీ రైట్స్ కూడా ఆయనే తీసుకోబోతున్నారు" అని బోనీ కపూర్ సన్నిహిత వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. శ్రీదేవి జీవితాన్ని పుస్తక రూపంలో తీసుకురావడానికి పలువురు రచయితలు, పాత్రికేయులు బోనీని కలిశారట. వారిలో ఒకరికి ఆ బాధ్యతను అప్పగిస్తున్నారని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.