శ్రియకి రెండు అలాంటివే

  • IndiaGlitz, [Thursday,September 07 2017]

బాల‌కృష్ణ వందో చిత్రం 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి'లో వ‌శిష్టీదేవిగా మెప్పించింది అందాల న‌టి శ్రియ‌. అయితే అదే బాల‌కృష్ణ కొత్త చిత్రం 'పైసా వ‌సూల్‌'తో నిరాశ‌ప‌రిచింది ఈ అమ్మ‌డు. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం శ్రియ రెండు చిత్రాల‌తో బిజీగా ఉంది. ఒక‌టి తెలుగులో రూపొందుతున్న 'వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు' కాగా.. మ‌రొక‌టి త‌మిళంలో తెర‌కెక్కుతున్న 'న‌ర‌గాసుర‌న్‌'. ఈ రెండు చిత్రాలు కూడా మ‌ల్టీ ఆర్టిస్ట్‌ల‌తో రూపొందుతున్న‌వే కావ‌డం విశేషం.

సుధీర్‌బాబు, నారా రోహిత్‌, శ్రియ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న 'వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు'లో హీరో, హీరోయిన్‌, విల‌న్ అనే కేట‌గిరి లేకుండా ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కి ఇంపార్టెన్స్ ఉంటే.. అర‌వింద్‌స్వామి, శ్రియ‌, ఇంద్ర‌జిత్‌, సందీప్ కిష‌న్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న 'న‌ర‌గాసుర‌న్‌'లో కూడా ఇదే ప‌రిస్థితి. సో.. శ్రియ ప్ర‌స్తుతం న‌టిస్తున్న రెండు చిత్రాలూ ఒకే శైలిలో తెర‌కెక్కుతున్నాయ‌న్న‌మాట‌.

More News

పవన్ డైరెక్టర్ కి ఛాలెంజింగ్ విషయం

పదహారేళ్ల క్రితం విడుదలై సంచలన విజయం అందుకున్న పవన్ కళ్యాణ్ 'ఖుషి'లో..

'మహానుభావుడు' కి ఆ పాటే హైలెట్ అట

యువ కథానాయకుడు శర్వానంద్,యూత్ ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి కాంబినేషన్లో

ఏడేళ్ల త‌రువాత‌..

సందీప్ చౌతా.. ఈ పేరు విన‌గానే 'నిన్నే పెళ్లాడుతా', 'ప్రేమ‌క‌థ‌', 'సూప‌ర్‌', 'బుజ్జిగాడు' లాంటి మ్యూజిక‌ల్ హిట్స్ గుర్తుకువ‌స్తాయి. ప‌రిమిత సంఖ్య‌లోనే సినిమాలు చేసిన‌ప్ప‌టికీ గుర్తుండిపోయే బాణీలు ఇచ్చిన సందీప్‌.. తెలుగులో చివ‌రిగా చేసిన చిత్రం 'కేడి'.

విజ‌య్ ఆంటోనితో అంజ‌లి

తెలుగమ్మాయి అంజ‌లి.. త‌మిళంలోనే ఎక్కువ‌గా సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. 'అంగాడి తెరు' (షాపింగ్ మాల్‌), 'ఎంగేయుం ఎప్పోదుం' 'జ‌ర్నీ), 'ఇరైవి' త‌దిత‌ర త‌మిళ‌ చిత్రాల‌తో అంజ‌లి మంచి న‌టిగా పేరు తెచ్చుకుంది.

నివేదా.. ట్రాక్ మారుస్తోందా?

'జెంటిల్ మన్','నిన్నుకోరి'చిత్రాలతో తెలుగువారిని ఆకట్టుకున్న మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్.