మార్చి 8న తెలుగు, త‌మిళ భాష‌ల్లో 'బొట్టు' విడుద‌ల‌

  • IndiaGlitz, [Friday,February 22 2019]

'ప్రేమిస్తే' ఫేమ్ భ‌ర‌త్‌, న‌మిత, ఇనియా, ఊర్వ‌శి, ష‌కీలా ప్ర‌ధాన తారాగ‌ణంగా వి.సి.వ‌డివుడ‌యాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన చిత్రం 'బొట్టు'. మార్చి 8న ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఎస్‌.ఎస్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై జి.కుమార్ బాబు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా జి.కుమార్బాబు మాట్లాడుతూ - ''తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన కాంచ‌న‌, గంగ చిత్రాల త‌ర‌హాలోనే అద‌ర‌గొట్టే గ్రాఫిక్స్‌తో వ‌స్తోన్న మ‌రో హార‌ర్ కామెడీ యాక్ష‌న్ చిత్ర‌మిది. బొట్టు అనే పేరు గ‌ల ఓ గిరిజ‌న యువ‌తి క‌థ ఇది. క‌థాక‌థ‌నాలు చాలా స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. 52 నిమిషాల గ్రాఫిక్స్ మాయాజాలం ఈ చిత్రానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. సెన్సార్ ఇబ్బందుల కార‌ణంగా చాలా రోజులుగా సినిమా విడుద‌ల నిలిచిపోయింది. చివ‌ర‌కు, రివైజింగ్ క‌మిటీ ద్వారా స‌ర్టిఫికెట్ పొందాం.

మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఒక సరికొత్త అనుభూతిని క‌లిగిస్తుంద‌నే ఉద్దేశంతోనే ఈ చిత్రం విడుద‌ల హ‌క్కుల‌ను మేం తీసుకున్నాం. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఫ‌స్ట్ కాపీతో స‌హా విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాం'' అని తెలిపారు.

తంబిరామ‌య్య‌, సాయాజీ షిండే, మొట్ట రాజేంద‌ర్‌, మ‌న్సూర్ అలీఖాన్‌, నిరోషా త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: అమ్రీష్‌, కెమెరా: ఎనియాన్ జె. హ్యారీస్‌, మాట‌లు: ఎం.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, ఫైట్స్: సూప‌ర్ సుబ్బ‌రాయ‌న్‌, ఎడిట‌ర్‌: ఎలీనా, పాట‌లు: శివ‌గ‌ణేష్‌.

More News

తెలంగాణ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌..

తెలంగాణలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ ‘ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌’ను ప్రవేశపెట్టారు.

'15-18-24 లవ్ స్టోరీ' టైటిల్ లోగో ఆవిష్క‌ర‌ణ‌

15 వ‌య‌సు.. 18 వ‌య‌సు.. 24 వ‌య‌సు.. ఈ మూడు ద‌శ‌ల్లో ప్రేమ ఎలా ఉంటుంది? ఆ ప్రేమ‌ల్లో గ‌మ్మ‌త్త‌యిన సంగ‌తులేంటి?

ఒక్కో అమరవీరుడి కుటుంబానికి 25 లక్షలు: కేసీఆర్

పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 42 మంది సీఆర్ఫీఎప్ కుటుంబాలను ఆదుకునేందుకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకొచ్చారు.

'మ‌జిలీ' చిత్రీక‌ర‌ణ పూర్తి.. చైత‌న్య ఎమోష‌న‌ల్ ట్వీట్‌

పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య, సమంత తొలిసారి కలిసి నటిస్తోన్న చిత్రం 'మజిలీ'.

దాని కోసం మహేష్ ఆస‌క్తి

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ...తిరుగులేని ఇమేజ్ ఉన్న టాలీవుడ్ టాప్ స్టార్‌. త్వ‌ర‌లోనే ఓ అరుదైన ఫీట్ సొంతం కానుంది. విష‌య‌మేమంటే.. మ‌హేష్ మైన‌పు ప్ర‌తిమను మేడ‌మ్ టుస్సాడ్స్‌లో ఆవిష్క‌రించ‌నున్నారు.