చెర్రీకి ప్లాప్.. చంద్రబాబుకు హిట్ ఇచ్చిన బోయపాటి!?

  • IndiaGlitz, [Friday,April 19 2019]

టైటిల్ చూడగానే ఇదేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమే. మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను తెరెక్కించిన ‘వినయ విధేయ రామ’ సినిమా అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలే ఇందుకు కారణమని చిత్రబృందం ఒప్పుకుంది కూడా. అయితే ఇక్కడ చెర్రీకి ప్లాప్ ఇచ్చిన బోయపాటి.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం సూపర్ డూపర్ ఇచ్చేశారు. అయితే ఆ హిట్ ఏంటనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

వీవీఆర్ ప్లాప్ తర్వాత హైదరాబాద్‌ను వదిలేసి తిన్నగా అమరావతికి చేరుకున్న బోయపాటి టీడీపీ విజయానికి గాను తనవంతుగా ప్రకటనలు రూపొందించాడు. కేవలం నెలన్నర కాలంలోనే ఈ ప్రకటనలు చేసి పెట్టడంతో చంద్రబాబు ఆయన్ను మెచ్చుకున్నారట. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో టీడీపీ ప్రకటనలు చేయించాడు. అయితే వీటిలో ఒకటి అర అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ మిగిలినవన్నీ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. జనాల్లోకి బాగానే దూసుకెళ్లాయని టీడీపీ పార్టీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి.

భారీ రెమ్యునరేషన్!?

ఏడాది మొత్తం కష్టపడి.. చెమటోడ్చి ఒక సినిమా తీస్తే ఏ డైరెక్టర్‌కు అయినా ముట్టే డబ్బులు మహా అంటే 10 కోట్లు ఉండొచ్చు. ఇక స్టార్ డైరెక్టర్స్ అయితే కాస్త అటు ఉండొచ్చు. అయితే కేవలం నెల వ్యవధిలోనే టీడీపీకి ప్రకటనలు చేయించినందుకుగాను బోయపాటి శ్రీనుకు చంద్రబాబు.. ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికలవేళ బోయపాటికి నెలన్నర టైం లోనే బాగానే గిట్టుబాటైంది!. కాగా ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన పుష్కరాలు ఇలాంటి వ్యవహారాల్లో బోయపాటి కీలక పాత్ర పోషించిన సంగతి విధితమే. అయితే ఈ యాడ్స్ ద్వారా టీడీపీకి ఎన్ని ఓట్లు వచ్చి పడతాయో..? టీడీపీ విజయంలో ఏ మేరకు ఈ ప్రకటనలు దోహదపడతాయో..? అనేది తెలియాలంటే మే-23 వరకు వేచి చూడాల్సిందే మరి.

 

More News

బొమ్మాళి త‌మిళ చిత్రం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. ఇప్పుడు `సైలెంట్‌` అనే చిత్రంలో మాధ‌వ‌న్‌తో క‌లిసి న‌టిస్తోంది.

'మ‌జిలీ' రీమేక్‌లో ధ‌నుష్‌

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత పెళ్లి చేసుకున్న త‌ర్వాత క‌లిసి జంట‌గా న‌టించిన చిత్రం ` మ‌జిలీ`.

మీకోసం ఓ సీన్ మాత్ర‌మే

దేవ‌దాస్ త‌ర్వాత కింగ్ నాగార్జున సినిమా చేయ‌డానికి స‌మ‌యం తీసుకున్నాడు. మ‌ధ్య‌లో హిందీలో బ్ర‌హ్మాస్త్ర‌లో గెస్ట్ అప్పియ‌రెన్స్ చేశాడు.

జెట్ ఎయిర్‌వేస్‌కు మరో ఎదురుదెబ్బ

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ విమాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ బుధవారం అర్ధరాత్రి నుంచి పూర్తిగా సేవలు నిలిపివేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఆరంభంలో స్టాక్ మార్కెట్స్ హుషారు.. సాయంత్రానికి ఆవిరి!

రెండ్రోజుల ముందు వరకు రేసు గుర్రాల్లా దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. గురువారం నాడు ఒడిదుడుకుల మధ్య ముగిశాయి.