సగానికి తగ్గించుకున్న బోయపాటి రెమ్యూనరేషన్

  • IndiaGlitz, [Saturday,November 09 2019]

మాస్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకుని అగ్ర హీరోల‌తో యాక్ష‌న్ ఓరియెంటెడ్ సినిమాల‌ను తెర‌కెక్కించిన దర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను. ఈ ద‌ర్శ‌కుడు ప్ర‌స్తుతం బాల‌కృష్ణతో హ్యాట్రిక్ మూవీని తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రాబోతున్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. భారీ బ‌డ్జెట్‌తో సినిమాల‌ను తెర‌కెక్కించ‌డానికే బోయ‌పాటి ఆస‌క్తి చూపుతుంటాడు.

ఆ విష‌యంలో త‌ను కాంప్ర‌మైజ్ కాడు. కాబ‌ట్టి సినిమా మేకింగ్ విష‌యంలో నిర్మాత‌కు మ‌రీ భారం కాకుండా ఉండాల‌ని త‌న రెమ్యున‌రేష‌న్‌ని స‌గానికి త‌గ్గించుకున్నాడ‌ట‌. అంటే రూ.15 కోట్ల వ‌ర‌కు ఉండే బోయపాటి రెమ్యున‌రేష‌న్ త‌న తాజా చిత్రానికి మాత్రం రూ.8కోట్ల‌ను మాత్ర‌మే తీసుకుంటున్నాడ‌ట‌. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్‌ను విల‌న్‌గా న‌టింప చేస్తుండటంతో పాటు భారీ తారాగ‌ణాన్ని తీసుకోవాల‌ని బోయ‌పాటి యోచిస్తున్నాడ‌ట‌.

నిజానికి విన‌యవిధేయ‌రామ సినిమాకు ముందు వ‌ర‌కు బోయ‌పాటి రూ.15 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడ‌ట‌. అయితే ఆ చిత్రం డిజాస్ట‌ర్ కావ‌డంతో బోయపాటి త‌న త‌దుప‌రి సినిమాను ట్రాక్ ఎక్కించ‌డానికి స‌మ‌యం ప‌ట్టింది. మేకింగ్ విష‌యంలో బోయ‌పాటి ఈసారికి అలా కానిచ్చేస్తున్నాడు. మ‌రి బోయ‌పాటి స్వంత నిర్ణయం నిర్మాత‌కు ఏ మేర లాభాన్ని తీసుకొస్తుందో చూడాలి.

More News

మహేష్ మూవీకి స్పెష‌ల్ సాంగ్స్‌ను సిద్ధం చేసిన దేవిశ్రీ

సాధార‌ణంగా ఇప్ప‌టి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ అనైనా అనండి.. స్పెష‌ల్ సాంగ్స్ అనైనా అనండి.. ఓ సాంగ్ కామ‌న్‌గా ఉంటూ వ‌స్తుంది.

అయోధ్య తీర్పుపై జనసేనాని స్పందన ఇదీ...

భారతదేశంలో అతిపెద్ద, దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే కీలక అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం విదితమే.

అయోధ్యపై తీర్పు:  ‘జై శ్రీరామ్’.. మీ కొచ్చిన సమస్య ఏంటి?: రష్మి

దశాబ్దాలుగా నెలకొన్న అయోధ్య భూ వివాదంపై నేడు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

టీచర్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి

సినిమా రంగంలో సెంటిమెంట్‌ను ఫాలో కానీ వారుండ‌రు. టాప్ స్టార్స్ నుండి చిన్న‌వారు వ‌ర‌కు అంద‌రికీ ఏదో ఓక సెంటిమెంట్ ఉంటుంది.

ప్ర‌భాస్ 'జాన్' లో బాహుబలి సెంటిమెంట్

బాహుబ‌లితో నేష‌న‌ల్ రేంజ్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌. త‌ర్వాత విడుద‌లైన సాహోతో ఓకే అనిపించుకున్నాడు.