బోయపాటి శ్రీను చేతుల మీదుగా 'లెజెండ్' 1000 రోజుల పోస్టర్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,October 25 2016]

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'లెజెండ్' ఇప్పుడు విజ‌య‌వంతంగా 950 రోజుల‌ను పూర్తి చేసుకుని 1000 రోజుల దిశ‌గా ప‌య‌నిస్తుంది. 2014, మార్చి 28న విడుద‌లైన 'లెజెండ్ నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ క‌లెక్ష‌న్స్ 55 కోట్ల‌కు పైగా షేర్స్‌ను సాధించింది.

ప్ర‌స్తుతం నంద‌మూరి అభిమానులు బాల‌కృష్ణ ప్రెస్టిజియ‌స్ 100వ చిత్రం 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' కోసం అతృత‌గా ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంలో బాల‌కృష్ణ 'లెజెండ్' క‌డ‌ప‌జిల్లాలోని ప్రొద్దుటూరు అర్చన థియేట‌ర్‌లో స‌క్సెస్ ఫుల్‌గా 950 రోజుల‌ను పూర్తి చేసుకుని 1000 రోజుల‌ను పూర్తి చేసుకుంటుండటం విశేషం. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణను ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ఆవిష్క‌రించిన తీరు రియ‌ల్లీ సూప‌ర్బ్‌. ఈ శుభ సంద‌ర్భాన అర్చ‌న థియేట‌ర్ ప్రొప్రైట‌ర్ కె.ఓబుల్ రెడ్డి, లెజెండ్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటిని క‌లిసి లెజెండ్ 950 నుండి 1000వ రోజు పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

ర‌జ‌నీకాంత్ న‌టించిన 'చంద్ర‌ముఖి' 891 రోజుల విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శించ‌ప‌డి ద‌క్షిణాది సినిమా చ‌రిత్ర‌లో ఓ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఈ రికార్డ్‌ను చెరిపేస్తూ నంద‌మూరి బాల‌కృష్ణ లెజెండ్ 1000 రోజులుకు ప‌య‌నిస్తూ సరికొత్త హిస్ట‌రీని క్రియేట్ చేసింది. ఈ సంద‌ర్భంగా 'లెజెండ్' సినిమాను మెమ‌ర‌బుల్ మూవీగా గుర్తుండిపోయేలా చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు, నంద‌మూరి అభిమానుల‌కు చిత్ర‌ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను, నిర్మాత‌లు రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట‌, అనీల్ సుంక‌ర‌, సాయికొర్ర‌పాటి స‌హా చిత్ర‌యూనిట్ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

More News

చిరు సినిమా శాటిలైట్ హ‌క్కులు

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియ‌స్ 150వ  చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం త‌మిళ హిట్ చిత్రం కత్తికి రీమేక్‌.

న‌వంబ‌ర్ 10న అనంత‌పురంలో ప‌వ‌న్ బ‌హిరంగ స‌భ‌

న‌వంబ‌ర్ 10న అనంత‌పురంలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు స్పెష‌ల్ స్టేట‌స్ సాధ‌న కోసం ప్ర‌తి జిల్లాలో పోరాట స‌భ‌ను జ‌న‌సేన నిర్వ‌హిస్తుంద‌ని తిరుప‌తి బ‌హిరంగ స‌భ‌లో జ‌న‌సేన సేనాని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

బాహుబలి - కాష్మోరా కి ఉన్న తేడా అదే - కాష్మోరా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్

తమిళ హీరో కార్తీ, నయనతార, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా గోకుల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం కాష్మోరా. ఈ చిత్రాన్ని పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నవంబర్ 1 న 'రెమో' ఆడియో రిలీజ్

శివకార్తికేయన్, కీర్తిసురేష్ జంటగా బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్టైనర్ `రెమో`. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు విడుదల చేస్తున్నారు.

ఛల్ ఛల్ గుర్రం చిత్ర యూనిట్ ను అభినందించిన పవర్ స్టార్

శైలేష్, దీక్షాపంత్,అంగనారాయ్ ప్రధాన పాత్రల్లో ఎం.ఆర్.ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మోహన ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఛల్ ఛల్ గుర్రం’.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియో, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.