బోయపాటి స్టైల్ మారిందా..

  • IndiaGlitz, [Wednesday,July 12 2017]

యాక్ష‌న్ సినిమాలు చేయ‌డంలో దిట్ట‌ బోయపాటి శ్రీను. అందుకే బోయ‌పాటి శ్రీను సినిమా అనగానే సగటు ప్రేక్షకుడికి గుర్తొచ్చేది యాక్షన్‌ సీన్స్‌, ఎమోషనల్‌ డైలాగ్స్‌. బాలకృష్ణ, ఎన్టీఆర్‌, వెంకటేష్‌, రవితేజ వంటి హీరోలతో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ మూవీస్‌ చేసిన బోయపాటి తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా 'జయ జానకి నాయక' చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఈరోజు విడుదలైంది. ఈ టీజర్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు బోయపాటి.
రెగ్యులర్‌గా అతని సినిమాల్లో వుండే యాక్షన్‌ సీన్‌గానీ, కనీసం ఒక్క ఎమోషనల్‌ డైలాగ్‌గానీ లేదు. కేవలం హీరో, హీరోయిన్‌ మధ్య జరిగే సన్నివేశాలతోనే టీజర్‌ నిండిపోయింది. 'జయజానకి నాయక' చిత్రం ద్వారా బోయపాటి ప్రేక్షకులకు ఏం చూపించదలుచుకున్నాడో ఎవ్వరికీ అర్థం కావడంలేదు. అలా అర్థం కాకూడదనే అతని మార్క్‌ యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌ని దాచి హీరో, హీరోయిన్‌ మధ్య సీన్స్‌నే చూపించారా అనేది అందరి సందేహం. రెగ్యులర్‌గా కాకుండా భిన్నంగా టీజర్‌ని రిలీజ్‌ చేసిన బోయపాటి సినిమాలో ఏం చూపించబోతున్నాడో తెలుసుకోవాలంటే ఆగస్ట్‌ 11 వరకు ఆగాల్సిందే.

More News

జులై 21న విడుదలకానున్న 'మాయా మాల్'

దిలీప్, ఇషా, దీక్షాపంత్ ముఖ్యపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం "మాయామాల్". హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 14న విడుదల కావాల్సి ఉండగా.. డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు చిత్రాన్ని ఒకవారం పోస్ట్ పోన్ చేసి జులై 21న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నద్ధమవుతున్నారు.

ఆ పది మంది డ్రగ్స్ మత్తును వీడి బయటకు రావాలని కోరుకుంటున్నాం : నిర్మాత అల్లు అరవింద్

'టాలీవుడ్ ఇండస్ర్టీలో కొంత మంది యంగ్ స్టార్స్ డ్రగ్స్ మత్తులో తేలుతున్నట్లు తెలిసింది.

మలయాళ రంగంలోకి శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్

ఏమైంది ఈవేళ,అధినేత,బెంగాల్ టైగర్ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్

'వాసుకి' శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ టీవీ ఛానెల్

స్టార్ హీరోయిన్ నయనతార నటించిన చిత్రం 'వాసుకి'.

విడుదలైన నితిన్ , హను రాఘవపూడి 14 రీల్స్ 'లై' టీజర్

యూత్ స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.