Rangamarthanda:'రంగమార్తాండ' నుండి బ్రహ్మానందం గ్లిమ్స్ విడుదల!!!

  • IndiaGlitz, [Thursday,February 02 2023]

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్బంగా 'రంగమార్తాండ' నుంచి బ్రహ్మానందం గ్లింప్స్ రిలీజ్ చేసారు మేకర్స్. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్లో ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ , బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా ఈ మూవీ తెరకెక్కుతుంది.

గ్లిమ్స్ లో బ్రహ్మానందం తన స్వరంతో చెప్పిన ఎమోషనల్‌ డైలాగ్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ వీడియోలో బ్రహ్మానందం హాస్పిటల్​ బెడ్​పై సెలైన్ పెట్టుకుని కన్నీళ్లు నిండిన కళ్లతో.. గద్గద స్వరంతో చెప్పిన డైలాగ్ చూసి ప్రేక్షకుల ఫిదా అవుతున్నారు. రంగస్థల కళాకారుల జీవితాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల రంగమార్తాండ సినిమా నుండి మెగాస్టార్ చిరంజీవి చెప్పిన షాయిరీ అలాగే రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ సాంగ్ నన్ను నన్నుగా కు మంచి స్పందన లభిచింది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాకు ఆకెళ్ల శివప్రసాద్ సంభాషణలు అందించగా లక్ష్మీ భూపాల, కాకర్ల శ్యామ్, భల్లా విజయ కుమార్ సాహిత్యం అందించారు.

డైలాగ్: ధగధగ్గయా రాజమకుట సువర్ణ మణిగణ రాజరాజేశ్వరా !!!
సుయోధన సౌర్వభౌమ
శరా ఘాతలతో ఛిద్రమై
ఊపిరి ఆవిరై
దిగంతాల సరిహద్దులు చెరిగిపోతున్న వేళ
అఖండ భారత సామ్రాజ్యాన్ని,
కురుక్షత్ర సంగ్రామంలో కానుకగా ఇస్తానని
శుష్క వాగ్దానాలు వెల్లవేసిన,
ఈ దౌర్భగ్యుడుకి కడసారి దర్శనం కల్పిస్తున్నవా ???
నా దైవస్వరూపమా నన్ను క్షమించు....

More News

Vedha :ఫిబ్రవరి 9న 'వేద' రిలీజ్

కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్  నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి మాట్లాడుతూ...

Telusa Manasa: ‘తెలుసా..మనసా..’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా జశ్విక హీరోయిన్‌గా శ్రీబాలాజీ పిక్చర్స్, బ్యాన‌ర్‌పై వైభ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో

Nandamuri Taraka Ratna : తారకరత్నను పరామర్శించిన విజయసాయిరెడ్డి.. బాలయ్యకు థ్యాంక్స్

గుండెపోటుకు గురై ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్ధితి విషమంగానే

Sashivadane: 'శశివదనే' టైటిల్ సాంగ్ విడుదల చేసిన హరీష్ శంకర్

ర‌క్షిత్ అట్లూరి హీరోగా, కోమ‌లి ప్ర‌సాద్ హీరోయిన్‌గా రూపొందుతోన్న ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామా 'శశివదనే'.

Budget 2023 : పసిడి మరింత ప్రియం.. సెల్‌ఫోన్లు చవక.. బడ్జెట్ తర్వాత ఏ వస్తువుల ధరలు పెరిగాయి, ఏవి తగ్గాయి

2023- 24 ఆర్దిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.