'బ్రహ్మోత్సవం' ఫ్యామిలీ విలువలను చెప్పే లవ్ స్టోరీ - మహేష్ బాబు

  • IndiaGlitz, [Monday,May 16 2016]

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా, కాజల్‌, సమంత, ప్రణీత హీరోయిన్లుగా పివిపి సినిమా, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 20న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మహేష్ తో ఇంటర్వ్యూ....

విలువలను గుర్తుకు తెస్తుంది...

ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మనం మన లక్ష్యాల కారణంగా చిన్న చిన్న విలువలను మరచిపోతున్నాం. అటువంటి ఫ్యామిలీ విలువలను ను గుర్తుకు తెచ్చే చిత్రమే మా బ్రహ్మోత్సవం. మంచి కుటుంబ విలువలున్న లవ్ స్టోరీ. ఎమోషన్స్ చాలా స్వచ్చంగా కనపడతాయి.

కొత్త సబ్జెక్ట్....

సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు చిత్రం తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేసిన సినిమా. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా. ఇప్పటి వరకు ఏ సినిమాలో నేను చేయని కాన్సెప్ట్ తో చేసిన మూవీ. చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా కోసం హరిద్వార్, పూణే, ఉదయ్ పూర్ వంటి అవుట్ డోర్ లోకేషన్స్ ను ఓకే షెడ్యూల్ లో వెళ్లాం.

నిర్మాతగారికి థాంక్స్...

పివిపి గారికి థాంక్స్. ఎందుకంటే మాకంటే ఈ కథను ఎక్కువగా నమ్మిన వ్యక్తి ఆయనే. ఆయన నమ్మకం వల్లే ఈ సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది.

ఆ లెక్కలు వేసుకోలేదు...

శ్రీమంతుడు తర్వాత బ్రహ్మోత్సవంలాంటి సినిమా చేయాలని నేను అనుకోలేదు. ఎందుకంటే శ్రీమంతుడు సినిమా సమయంలోనే బ్రహ్మోత్సవం కథను శ్రీకాంత్ అడ్డాలగారు చెప్పడంతో సినిమా చేశాను. శ్రీమంతుడు సక్సెస్ తర్వాత ఇటువంటి సబ్జెక్ట్ తో సినిమా చేయడం నా లక్ గా భావిస్తున్నాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్...

నేను తదుపరి మురగదాస్ గారి దర్శకత్వంలో సినిమ చేయబోతున్నాను. ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం అనేది డ్రీమ్ కమ్ ట్రు లాంటిది. సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాను.

More News

దాసరి చేతుల మీదుగా రైట్ రైట్ ఆడియో విడుదల

సుమంత్ అశ్విన్,ప్రభాకర్,పూజా జవేరి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్నచిత్రం రైట్ రైట్.ఈ చిత్రాన్ని మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్నారు.

గౌతమీపుత్ర శాతకర్ణి ఓవర్ సీస్ హక్కులను దక్కించుకున్న.....

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రధారిగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి.

మూడు నెలలు.. మూడు చిత్రాలతో కాజల్

తొమ్మిదేళ్లకు పైగా కథానాయికగా రాణిస్తోంది కాజల్ అగర్వాల్.ఇప్పటికీ సినిమాల విషయంలో జాగ్రత్తలు అడుగులు వేస్తూ ఆశ్చర్యపరుస్తోందీ ముద్దుగుమ్మ.

'అఆ'తోనూ కొనసాగుతుందా?

అరడజను సినిమాల తరువాత స్టార్ హీరో లేకుండా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం 'అఆ'.

మహేష్ , తారక్ తరువాత బన్నీకే..

ఒకసారి జరిగిన మ్యాజిక్ మరోసారి జరగడం చాలా తక్కువ సందర్భాల్లోనే వీలవుతుంది.యువ సంగీత సంచలనం ఎస్.థమన్ కి కూడా అలాంటి సందర్భాలున్నాయి.