ఢిల్లీ లో బ్ర‌హ్మోత్స‌వం

  • IndiaGlitz, [Tuesday,February 23 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ క్రేజీ మూవీ బ్ర‌హ్మోత్స‌వం. తెలుగు, త‌మిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మిస్తుంది. ప్ర‌స్తుతం బ్ర‌హ్మోత్స‌వం చిత్రం రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. మ‌హేష్, స‌మంత‌, ప్ర‌ణీత లపై కొన్ని కీల‌క సన్నివేశాల‌ను చిత్రీక‌రించారు. దీంతో పాటు మ‌హేష్, రావు ర‌మేష్, స‌త్య‌రాజ్ ల‌పై కూడా ముఖ్య‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

ఈ నెల 25 వ‌ర‌కు రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ చేయ‌నున్నారు. మార్చి 1 నుంచి బ్ర‌హ్మోత్స‌వం టీమ్ ఢిల్లీ లో 12 రోజులు పాటు షూటింగ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఏప్రిల్ 28న బ్ర‌హ్మోత్స‌వం మూవీ రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ...కొన్నికార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. తాజా స‌మాచారం ప్ర‌కారం... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 31న బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే బ్ర‌హ్మోత్స‌వం రిలీజ్ డేట్ అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నారు.

More News

హిట్ కాంబినేష‌న్ రిపీట్ చేయ‌నున్ననితిన్..

నితిన్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నచిత్రం అ ఆ. ఈ చిత్రం ఏప్రిల్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

'కృష్ణాష్టమి' చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ - దిల్ రాజు

టాలీవుడ్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలనునిర్మించిన ప్రముఖు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం కృష్ణాష్టమి.

మరో మెగా హీరో పక్కన రకుల్....

ప్రస్తుతం అనుష్క,సమంతల తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.

'సరైనోడు' లో శ్రీకాంత్ ఎవరంటే...?

స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రం 'సరైనోడు'.

వెంకీ బాబు..బంగారం రిలీజ్ డేట్...

విక్టరీ వెంకటేష్ -యువ దర్శకుడు మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం బాబు...బంగారం.